ఫీజు భూతం: 'నాసిరకం' విద్యకు ముగింపు పలకండి...

VAMSI
మానవ సృష్టికి దేవుడే కారణం. జన్మించిన అందరికీ తెలివి ఆలోచించే సామర్ధ్యం సమానంగానే ఉంటాయి. కానీ మన పెరుగుతున్న కొద్దీ అవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనల స్థాయి మరింతగా పెరగడానికి పాఠశాలలు ఉన్నాయి. అక్కడ ఉపాధ్యాయులు వారికి తెలియని ఎన్నో విషయాలను బోధించి మరింత జ్ఞానాన్ని పెంపొందేలా చేస్తారు. అయితే పిల్లలు ఆలోచన శక్తి పరిధి పరిమితంగా ఉంటుంది. స్కూల్ కు వెళ్లిన తర్వాతే అది అంచెలంచెలుగా ఎదిగి పెద్ద పెద్ద మేధావులు అయ్యేలా చేస్తుంది. అయితే ఇలా మేధావులుగా మారడానికి ఎటువంటి విద్య పిల్లలకు అందించాలో ఇప్పుడున్న చాలా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు తెలియదు. ఏ విధంగా పాఠాలను బోధించాలో సరైన అవగాహన చాలా మంది ఉపాధ్యాయులకు ఉండదు. ఎంతో ఫ్రెష్ గా ఉన్న పిల్లల మెదడును వీరి ఒత్తిడితో కూడిన బోధనా విధానాలతో ఇబ్బంది పెడుతున్నారు.

మాములుగా ఆయా తరగతులకు సబంధించి ఏమి నేర్పించాలి అనే విషయాలను ప్రభుత్వం ఒక విద్యా కరికలం ను తయారుచేసి అన్ని పాఠశాలలకు అందిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన పాఠాలను మాత్రమే విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. అంతే కాకుండా పిల్లలకు మానసికంగా ఎటువంటి ఒత్తిడి కలుగకుండా ఉండేలా మాత్రమే బోధనా చేయాలని ఉపాధ్యాయులకు సైతం కొన్ని నియమాలను ఇస్తారు. కానీ దాదాపుగా సగానికి పైగా పాఠశాలలు మరియు ఉపాధ్యాయులు ఈ నిబంధనలను తుంగలో తొక్కేస్తారు. ఆ తరగతి నాలుగు గోడల మధ్యన పిల్లలను పాఠాలు బోధించే పేరిట వారి మనసుతో ఆడుకుంటారనుకోండి.

ఒక అంశాన్ని బోధించేటప్పుడు పిల్లలకు అర్ధమయ్యే రీతిలోనే చెప్పాలి. ఏదైనా ఒక ప్రత్యక్ష ప్రయోగం ద్వారా వివరిస్తూ చెబితే పిల్లల మనసులోకి వెళుతుంది. ఇలా చెప్పిన అంశాన్ని మళ్ళీ వారివుకి అర్థమైందా లేదా అని ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవాలి. టెస్ట్ అంటే పరీక్ష పెట్టడం కాదు. వారికి అర్ధమయిన విషయాన్ని వారి సొంత మాటల్లో వివరించేలా వారిని ప్రేరేపించాలి.

ఉదాహరణకు: ఒకటవ తరగతి పిల్లవాడికి అంకెలు నేర్పించాలి అనుకుంటే... కొన్ని వస్తువులను ఉపయోగించి వారికి  సులభంగా నేర్పించాలి. వాటిని లెక్కిస్తూ వారిని మళ్ళీ చెప్పమనాలి..ఆ తరువాత వస్తువులను ఒక టేబుల్ పై ఉంచి మీరే వారిని ఒక వస్తువును తీసుకో, రెండు వస్తువులను తీసుకో అంటూ...ప్రాక్టీస్ చేయిస్తే పిల్లలకు ఆ విషయం ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

అలా కాకుండా 1 నుండి 9 వరకు అంకెలన్నీ బోర్డు మీద రాసి ..వారి చేత బుక్స్ లో రాయించి...బట్టీ పట్టిస్తే అప్పటివరకూ గుర్తుంటాయి అంతే, కొన్నిరోజులకు మరిచిపోతారు. పైగా చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఇలాంటి చదువు అవసరమా ? అని తల్లితండ్రులు ఆలోచించాలి. బట్టీ చదువులకు స్వస్థి చెప్పాలి. ఇలాంటి నాసిరకమైన విద్యావిధానాలను వ్యతిరేకించాలి. ఇందులో ప్రజలకన్నా ప్రభుత్వమే ఎక్కువగా చిరవ తీసుకోవాలి. సహజమైన విద్యావిధానాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి సక్సెస్ రేట్ ఉంది.


ఆటల ద్వారా విద్యను బోధిస్తే ఉపాధ్యాయునికి తక్కువ పని ఉంటుంది. విద్యార్థులకు ఎక్కువ పని ఉంటుంది. విద్యార్థి ఒక ఆటను ఆడుతున్నాను అనే భావనలో ఉంటాడే తప్ప చదువుతున్నాను అనే ఫీలింగ్ రాదు. ఇలాంటి విద్యావిధానాన్ని అవలంభిస్తే ఒత్తిడితో కూడిన చదువులకు ముగింపు పలికి మంచివిద్యార్థులు మంచి చదువు తయారవుతుంది.

కాబట్టి మీ పిల్లలు చదివే స్కూల్ లో ఏ విధమైన విద్యావిధానం అమలులో ఉందో గ్రహించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: