అలెర్ట్ కాల్ : అడవిలో అన్న ఏం చెప్తుండు ?
ఎగిరిన జెండా
పేలిన తుపాకీ
తేలిన శవం
మళ్లీ మళ్లీ ఆ పార్టీ ఉనికిని
బలోపేతం చేసిందా లేదా
బలహీన పర్చిందా?
ఆ ఉద్యమ ఉత్సాహం పార్టీలో
ఉన్నా లేకున్నా పార్టీ చావదు
నడక చావదు పరుగూ చావదు ?
అన్నది మావోల స్టేట్మెంట్
విశాఖ మన్యంలో కీలక కదలికలు
లొంగుబాటు ప్రేలాపనలు పట్టించుకోం
అంటున్న మావో లీడర్ గణేశ్
ఫస్ట్ కాజ్ : జగన్ కు మావోయిస్టులతో కొత్త తలనొప్పులు ? డీజీపీ స్టేట్మెంట్ తో మావోల అలర్ట్ .. ఆగిపోతాయా తవ్వకాలు? మరో ఎన్ కౌంటర్ వద్దు గాక వద్దు.
అడవిని రక్షించడం
అడవిలో ఉన్న వనరులను రక్షించడం
ఈ రెండూ ప్రధాన ధ్యేయం
మనుషులు చనిపోవడాన్ని ఒప్పుకోకండి. రక్తపాతంవద్దన్నది ఓ సిద్ధాంతం. ఏం జరిగినా ఈ ప్రభుత్వం నుంచి తమకు సానుకూల సంకేతాలు రావడం లేదన్నది మావోల అంతర్మథనం. ఇప్పుడు విశాఖ మన్యంలో ఏం జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం నడిచి న విధంగానే జగన్ ప్రభుత్వం నడిస్తే మళ్లీ మళ్లీ తమ తరఫున ప్రతిఘటనలు ఉంటాయని కొన్ని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అడవిలో ఏం జరుగుతోంది.
బాక్సైట్ తవ్వకాలు వద్దంటోంది
లేటరైట్ తవ్వకాలు ఆపేయండి
మరో ఎన్ కౌంటర్ ?
సన్నాహాలు తప్పవా!
చంద్రబాబు ప్రభుత్వం చేసిన విధంగా తాము చేయమని పదే పదే జగన్ సర్కారు చెబుతున్నా, వాస్తవాలు అలా లేవని అంటోంది మావోయిస్టు పార్టీ. అడవిని తరలించు కుపోయే శక్తుల నిలువరించచే శక్తి తమకు ఉందని స్పష్టం చేస్తోంది. అరకు ఎమ్మెల్యే తో సహా మిగతా వారెవ్వరూ మావోలకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఏం మాట్లాడ కున్నా లోలోపల మాత్రం అంతర్మథనం చెందుతున్నారు. మరో ఎన్ కౌంటర్ జరిగితే విలువయిన ప్రాణాలు ఎన్ని గాల్లో కలిసిపోతాయో అన్నది అర్థం కావడం లేదని,ఈ దిశగా అడుగులు పడక మునుపే నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు.. మరోవైపు విశాఖ లాండ్ మాఫియాపై కూడా మావోలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.