దేశంలో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నింటిలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. స్వతంత్ర పోరాటం నుంచి ఉన్నటువంటి ఈ పార్టీ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. భారతదేశంలో ఎక్కువ కాలం పాలిం చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. అలాంటి పెద్ద పార్టీకి ప్రస్తుతం కష్టాలు వచ్చిపడ్డాయట. దీంతో పార్టీ తమ కష్టాలు తగ్గించుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. పార్టీ విరాళాలు తగ్గిపోవడంతో ప్రతి ఎంపీ సంవత్సరంలో 50 వేల రూపాయలు విరాళం ఇవ్వాలని పార్టీ కోరినట్టు తెలు స్తోంది. ఇదే కాకుండా వీలైనంత వరకూ ఖర్చులు కూడా తగ్గించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. చాలా రాష్ట్రా ల్లో పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో , పార్లమెంటులో కూడా ఎక్కువ మంది ఎంపీలు లేకపోవడంతో పార్టీకి విరాళం ఇచ్చే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో ఎన్నడూ లేని విధంగా పార్టీ కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. ఖర్చులు తగ్గించు కోవాలని నేతలకు సూచనలు చేసింది. ఇందులో కొందరు ఎంపీలు పార్టీల ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు.
వీరంతా ప్రభుత్వం నుంచి లభించే అటువంటి విమానయాన సౌకర్యాలను ఉపయోగించుకోవాలని తెలిపింది. ఇక మీద కార్యదర్శులుగా ఉన్నటువంటి వారికి 14 వేల కిలోమీటర్ల లోపు రైలు ద్వారానే ప్రయాణించవలసి ఉంటుందని తెలియజేసింది. ఒకవేళ 14 వేల కిలోమీటర్లు దాటితే తక్కువ ఇచ్చే అటువంటి విమానం ఛార్జీలు అందిస్తామని వెల్లడించారు. దీనిలో ఒక షరతు కూడా పెట్టారు. విమానం యొక్క చార్జీలు ట్రైన్ చార్జీల కంటే తక్కువగా ఉంటేనే అందిస్తామని తెలిపారు. అలాగే ప్రతి పార్లమెంటు సభ్యుడు సంవత్సరానికి 50 వేల రూపాయల విరాళం అందించాలని, కనీసం ఇద్దరూ కార్యకర్తల నుండి నాలుగు వేల విరాళాలు సేకరించాలని తెలియజేసింది.
2018-2019 383 కోట్ల రూపాయలు మాత్రమే ఎన్నికల బాండ్లు వచ్చాయని, 2019 -2020 లో ఇంకా తగ్గి 318 కోట్లు మాత్రమే వచ్చాయని, దీంతో విరాళాలు తగ్గాయని అందుకే పార్టీ అధిష్టానం నేతలకు ఈ సూచన చేసినట్లు తెలిసింది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చే 15 వేల రూపాయలను, కార్యదర్శికి అందించే 12 వేల రూపాయలను కోతలు పెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంటే, బిజెపి పార్టీ విరాళాలు మాత్రం ఒక సంవత్సరంలో 1450 కోట్ల నుంచి 2,500 కోట్ల వరకూ పెరిగాయి.