వైరల్ : పనికి రాని వాటితో కోట్లలో సంపాదన... ఎలాగంటే...?
అసలు వివరాల్లోకి వెళితే.. 26 సంవత్సరాల అరిస్టైడ్ కౌమే అనే ఒక కళాకారుడు అరిస్టైడ్ బీచులలో సముద్రపు అలల వెంట కొట్టుకొచ్చిన పాత చెప్పులు, బూట్లను ఏరుకునేవాడు. అయితే అతన్ని చూసి అక్కడ ప్రజలు అతన్ని పిచ్చివాడిలాగా భావించారు.కానీ అతనే ఇప్పుడు ఒక స్టార్ లాగా మారిపోయాడు.ఆ చెప్పులతో కళాకండాలు తయారుచేసి వాటిని అమ్ముతున్నాడు. ఈ సృష్టిలో పనికిరానిది అంటూ ఏమి లేదు. మనసు పెట్టి ఆలోచిస్తే పనికిరానివాటితో కూడా ఎదో ఒకటి తయారుచేయవచ్చు. అలాగే నేను ఈ పనికిరాని వస్తువులకు ఆర్ట్ వర్క్ ద్వారా ఒక మంచి జీవితాన్ని ఇచ్చాను అని ఆయన అంటున్నాడు. అలాగే ఇలా చేయడం వలన పర్యావరనాన్ని కూడా ప్లాస్టిక్ అనే భూతం నుంచి రక్షించవచ్చని అంటున్నాడు.ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ యువకుడు ప్రతిభను, అతని కళాకృతులను ఐవరీ కోస్ట్ కళా సంస్థ గుర్తించింది. అల అతడి ఆర్ట్ వర్క్స్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాయి.