స్కూళ్లలో కరోనా టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలని... ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ మహమ్మారి పరిస్థితుల పై క్యాంపు కార్యాలయం లో సిఎం జగన్ ఈ రోజున కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్ ప్రోటో కాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని.. వైద్య ఆరోగ్య శాఖ మార్గ దర్శకాలను పాటించేలా అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు సిఎం జగన్. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.. థర్డ్ వేవ్ నేపథ్యం లో ముందస్తు గా తీసు కోవాల్సిన చర్యల పైనా సమీక్ష నిర్వహించారు సిఎం జగన్.
ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ వెళ్లాలన్నారు సిఎం జగన్. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఇస్తున్నట్లు చెప్పారు. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే... ముందస్తుగా అనుమతి తీసుకోవాలని.. పెళ్లిళ్ల లో 150 మందికే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు సిఎం జగన్. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్న సీఎం జగన్.. ఉల్లంఘించే వారి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలన్న సీఎం.. ఆ తర్వాత ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించ కూడదన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సమర్థ వంతమైన ఔషధ నియంత్రణ, పరిపాలన కోసం రెండు కొత్త వెబ్‌సైట్లు తీసుకు వస్తామన్నారు.