రెచ్చిపోతున్న తాళిబన్లు.. ఆగని ఆరాచకాలు?

praveen
ప్రపంచ దేశాలు ఏదైతే జరగకూడదు అని అనుకున్నాయో అదే జరిగి పోయింది. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ రాజ్యం వచ్చేసింది  ఇక ఇటీవల ఏకంగా ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు దేశాన్ని అప్పగిస్తూ లొంగిపోయింది. దీంతో మళ్లీ ఆఫ్ఘనిస్తాన్లో అరాచక పాలన మొదలయ్యింది. తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో ఇక దేశ ప్రజలు అందరూ భయంతో వణికి పోతున్నారు. ఏ క్షణంలో ప్రాణాలు పోతాయో అని అనుక్షణం భయపడుతూ బ్రతుకుతూన్నారు.  అయితే ఇక ప్రస్తుతం దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు   ఇంకా అరాచకాలను సృష్టిస్తూ ఉన్నారు.


 ప్రస్తుతం తాలిబన్లు అధికారం లోకి రావడం తో ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మొత్తం ఇక తాలిబన్ల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆఫ్ఘనిస్థాన్లోని ఒక విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక ఇది గమనించిన తాలిబన్లు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్  రాజధాని నగరంలో ఉన్న హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శిథిలావస్థకు చేరుకునే విధంగా దారుణంగా దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. కాబూల్ విమానాశ్రయంలో కొంతమంది సైనికులు కూడా ప్రజలు కూడా విమానానికి ఎక్కి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడికి తాలిబన్లు రావటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.



 అంతే కాదు కొన్ని విమానాలను ఏకంగా రన్ వే పైనే పట్టుకున్నారు తాలిబన్లు. ఇక విమానాశ్రయం ప్రాంతంలో తాలిబన్లు దారుణంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో ఏకంగా పది మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండడంతో తాలిబన్ల అరాచకాలు ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో అమలులో ఉన్న రూల్స్ అన్ని మారుస్తూ కొత్త రూల్స్ అమలులోకి తెస్తున్నారు తాలిబన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: