ఈ బ్యాంకులో ఖాతా ఉందా.. మీకే ఈ గుడ్ న్యూస్?

praveen
ఇటీవలి కాలంలో తమ కస్టమర్లను ఆకర్షించేందుకు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ నుండి లోన్ తీసుకునే కస్టమర్లు అందరికీ కూడా ప్రాసెసింగ్ ఫీజును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది  ఇక  స్టేట్ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం లోన్ తీసుకునే వారి పై  సానుకూల ప్రభావం చూపింది.  ఇక ఇప్పుడు మరో దిగ్గజ బ్యాంకు కూడా స్టేట్ బ్యాంక్ దారిలోనే నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో దిగ్గజ ప్రైవేటు రంగ బ్యాంకు గా కొనసాగుతుంది హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్.  ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది.



 అటు కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు పలురకాల రుణ సదుపాయాలను కూడా కల్పిస్తుంది హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్. ఇక ఇప్పుడు తమ బ్యాంకు తరఫున లోన్ పొందే వారికి ఊరట కలిగే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటిస్తూ బ్యాంకు కస్టమర్లు అందరికీ కూడా శుభ వార్త చెప్పింది హెచ్డిఎఫ్సి. ఇటీవలే హెచ్డిఎఫ్సి తీసుకున్న నిర్ణయంతో ఇకనుంచి లోని తీసుకోవాలనుకునే వారికి ఎంతో ఊరట కలుగుతుంది.  ఇటీవలే సెక్యూరిటీ తనఖా లోన్ లపై ఏకంగా ప్రాసెసింగ్ ఫీజును తగ్గించింది హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్. ప్రస్తుతం ప్రాసెసింగ్ ఫీజు కేవలం 750 రూపాయలు మాత్రమే వసూలు చేద్దాము అంటూ ప్రకటించింది.



 ఇక తన తనఖా లోన్ పై అటు వడ్డీ రేటు 9.90 శాతం నుంచి ప్రారంభమవుతుందని హెచ్డిఎఫ్సి స్పష్టం చేస్తోంది. అయితే ఇక ప్రస్తుతం హెచ్డిఎఫ్సి ప్రకటించిన ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈ ఆఫర్ను కస్టమర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అయితే సెక్యూరిటీ తనఖా కింద హెచ్డీఎఫ్సి కస్టమర్లు దాదాపు రెండు లక్షల వరకు కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి పాలసీ లేదా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, గోల్డ్ డిపాజిట్ సర్టిఫికెట్, వికాస్ పత్ర వంటి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఎంతో సులభంగా రుణం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: