లోన్ ఈఎంఐ కడుతున్నారా.. అయితే మీకు న్యూస్?

praveen
ఒకప్పుడు డబ్బు అవసరం వస్తే పక్కింటివారినో పొరుగింటి వారినో అడిగే వారు. కానీ ఇప్పుడు మాత్రం డబ్బు అవసరం లేకున్నా రుణాలు అందించేందుకు అన్ని బ్యాంకులు సిద్ధం అయ్యాయి.   అవసరం లేకున్నా మీకు లోన్ కావాలి సార్ అంటూ ఎప్పుడూ ఏదో ఒక కాల్ కానీ మెసేజ్ కానీ మొబైల్కు వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే డబ్బులు అవసరమైనప్పుడల్లా ఎంతోమంది బ్యాంకుల నుంచి లోన్ రూపంలో డబ్బులు తీసుకుంటున్నారు ఆతరువాత ఈఎంఐ  రూపంలో ఈ డబ్బును తిరిగి చెల్లిస్తున్నారు.



 ఒకవేళ మీరు కూడా ఇలా లోన్ ఈఎంఐ  చెల్లిస్తూ ఉంటే మీ కోసం ఒక శుభవార్త సిద్ధంగా ఉంది. ఇటీవలే కోటక్ బ్యాంక్ డి ఐ వై ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డి ఐ వై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని అర్థం వస్తుంది  ఇంతకీ ఈ ఫీచర్ ద్వారా అసలు ఉపయోగం ఏమిటి అని అంటారా..  ఇక ఈ కొత్త ఫీచర్ ద్వారా రుణ గ్రహీతలు సులభంగానే మిస్సయిన ఈఎమ్ఐ చెల్లించే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మిస్సయిన ఈఎంఐ  చెల్లించడానికి  బ్యాంకు కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది  కానీ కొత్త ఫీచర్లతో ఇంట్లో నుండి మిస్ అయినా ఈ ఎం ఐ  లను చెల్లించవచ్చు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుందని ఇటీవలే కోటక్ బ్యాంకు తెలిపింది  కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు అంటూ తెలిపింది.




 అంతే కాకుండా ఇటీవల ఏకంగా కోటక్ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. కొటక్ బ్యాంక్ డెబిట్ కార్డు కలిగిన కస్టమర్లు ఇక ఈ నో కాస్ట్ ఇఎంఐ ఫెసిలిటీ కి అర్హులు. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఏ మాదిరిగా నో కాస్ట్ ఇఎంఐ ఫెసిలిటీ అందుబాటులో ఉందో.. డెబిట్ కార్డు  వినియోగదారులకు కూడా అదే రీతిలో ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది  ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ కొనుగోలకు ఈ ఫీచర్ ఉపయోగించుకునేందుకు ప్రస్తుతం కోటక్ బ్యాంక్ కస్టమర్ లకు అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: