తెలుగుదేశంలో ఆగస్టు ముసలం !
అధినేత మాటనే కాదన్న వైనం
గతంలోనే ఉంది
ఇప్పుడు అది మళ్లీ జరగనుంది
తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభాలు
తప్పేలా లేవు.. ఆ రోజు జరిగిన మాదిరిగానే
ఇప్పుడూ పార్టీలో ముసలం బయలుదేరింది
లోకేశ్ ను వ్యతిరేకిస్తున్నారా లేదా ఆయన
ఏకంగా అధినేతనే టార్గెట్ చేశారా?
అచ్చెన్నతో బుచ్చయ్య చౌదరి ఏం మాట్లాడారు?
సఫలీకృతం కాని చర్చలు..అన్నది నిజమేనా!
గోరంట్ల దారిలో ఎవ్వరున్నా సరే వారికి వైసీపీ వెల్కం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్న సంగతి విధితమే..అధినేత చంద్రబాబుకు, ఆ యనతో పాటు నిస్తేజంగా ఉన్న నాయకులకూ ఇలాంటి తీవ్రతలు పరిష్కరించడం,ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం కాస్త కష్టమే! గతం కన్నా ఇప్పుడు టీడీపీకి సీనియ ర్ల అవసరమే ఎక్కువ. కళా వెంకట్రావు లాంటి లీడర్లు కూడా మౌనంగానే ఉంటూ, బీజేపీతో టచ్ లో ఉంటున్నారు అన్న వార్తలు వినిపిస్తున్న దాఖలాలు అనేకం. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు అధినేత ఏ చర్యలు తీసు కుంటారు అన్నదే ఆసక్తిదాయకం. పార్టీలో అధికారం ఒక్కరిదే అన్న భావనతో నే గోరంట్ల వెళ్లాలనుకుంటున్నప్పుడు ఆ మాటేదో స్పష్టంగా వెల్లడి చేయాలి కానీ అలకబూనడంతోనే సంబంధిత సమస్యలు పరిష్కారం కావని పరిశీలకులు అంటున్నారు.
సుదీర్ఘ అనుబంధం ఉన్న నేత
అసెంబ్లీలో పోరాట యోధుడు
వాస్తవానికి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీలో తమ్ముళ్లు క్రమశిక్షణ తప్పిన దాఖలాలు అనేకం. కానీ సీనియర్లు కూడా ఇలా పార్టీపై కోపంగా ఉండడం ఇటీవలే చోటు చేసుకుంటున్న పరిస్థితులకు తార్కాణం. పార్టీలో తనకు విలువ లేదన్న బాధతో గో రంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారన్న వా ర్తలు వస్తున్నాయి. మొదట నుంచి పార్టీనే నమ్ముకున్న తనకు ఇటీవల కాలంలో పరి ణామాలు బాధించాయని ఆయన చెబుతున్నా రు. ఈ నేపథ్యంలో పార్టీని వీడి పోవాలన్నది ఆయన భావన. ఎన్టీఆర్ కాలం నుం చి చంద్రబాబు వరకూ ఆయన పార్టీకి విశిష్ట సేవ లు అందించిన వైనం మరువ లేం.
సంక్షోభ నివారణ కష్టమే!
ఇంతటి వైసీపీ వేవ్ లోనూ ఆయన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గెలవడమే కాదు ఆయనతో పా టు నగర ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ గెలుపుపై కూడా కాస్తో కూస్తో ప్రభావం చూపారు అన్నది వాస్తవం. పార్టీ మాత్రం తనను ప క్కనపెట్టేసిందని వేదనలో ఉండ డం తెలుగుదేశంకు తీరని సమస్యగానే పరిణమించారు. ఈ నేపథ్యంలో తానేమీ చెప్పబోనని రా జీనామా విషయమై గోప్యత పాటి స్తూ గోరంట్ల చేసిన ప్రకటన లేదా చెప్పిన సమాచారం తెలుగుదేశం వ ర్గాల్లో కలవరం రేపుతోం ది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కా ల్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన దార్లోకి రాలేదని టీ డీపీ వర్గాలు చెబు తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ని ఆగస్టు సంక్షోభం వీడేలా లేదన్న మాటలు వినవస్తున్నాయి.