బాబోరి రేవంత్: ప్రతి అడుగులో 'బాబే'నా ?
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయితే రేవంత్ ను వెనుకుండి నడిపిస్తున్నది ఏదో తెలియని శక్తి అని, ఆ శక్తి ఎవరో కాదు రేవంత్ రెడ్డి రాజకీయ గురువు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రేవంత్ వేసే ప్రతి అడుగులోనూ బాబు ఉన్నాడని తెలంగాణ అంతా కోడై కూస్తోంది. కేసీఆర్ ను దెబ్బ తీయడానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసే వ్యూహ రచన చేస్తున్నారని గట్టిగా వినబడుతోంది. ఎలాగు తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని తెలిసే కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ కు సహాయం చేస్తున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడూ వీరిద్దరూ కలుస్తున్నారని కూడా తెలుస్తోంది. అవసరమైతే అధికారంలో ఉన్న తెరాసను దెబ్బ తీయడానికి కాంగ్రెస్ అధిష్టానం టీడీపీని కలుపుకుని పోతుందని, ఇప్పటికే గత ఎన్నికల్లో ఇదే జరిగిందని...అయితే ఈ సారి రేవంత్ రాకతో మరింత బలంగా ప్రణాళికలు ఉంటాయని సమాచారం.
రేవంత్ చంద్రబాబు సూచనల మేరకే కాంగ్రెస్ లో నడుచుకుంటనున్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసినా పార్టీ అభివృద్ధికి తోడ్పడుతుందని కిక్కురుమనకుండా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా తీక్షణంగా పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడుకు చంద్రబాబు లాంటి మేధావి బుర్ర తోడయితే ఎదుట ఎటువంటి నాయకుడున్నా చిత్తయిపోవాల్సిందే అంటున్నారు. మరి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు మేధస్సుతో తెరాస ను ఓడిస్తారా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం చూడాల్సిందే.