లక్షలు ఖర్చు చేసి వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు !
నా నియోజకవర్గంలో స్కూల్స్ బాగాలేదని వార్తలు రాస్తున్నారని... దశల వారీగా స్కూల్స్ అబివృద్ది చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదా ? అని ప్రశ్నించారు. ఆ స్కూల్స్ దుస్థితికి చంద్రబాబు కారణం కదా...? పక్కనే ఉన్న ఆ స్కూల్స్ ని కారు దిగి ఎప్పుడైనా పరిశీలించాడా..?అని నిలదీశారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తి అయ్యాయి...రెండో దశ కూడా ప్రారంభం అయ్యాయన్నారు. ప్రజలంతా స్కూల్స్ విషయంలో సీఎం వైఎస్ జగన్ చర్యలను అభినందిస్తున్నారని... చివరికి చంద్రబాబు చదివిన స్కూల్ దారుణంగా ఉందని మా ఎమ్మెల్యే ఎప్పుడో చెప్పారన్నారు. దాన్ని కూడా మా సీఎం బాగుచేస్తున్నారని.. అవన్నీ ఈ పత్రికలకు కనిపించవా...? అని ప్రశ్నించారు.
మొన్న కూడా మీటర్లంటూ తప్పుడు రాతలు రాశారని... ఆ రోజు చంద్రబాబు విద్యుత్ ఉద్యమంలో అరాచకం చేస్తే ఒక్క మాటన్నా రాసారా..? అని ఫైర్ అయ్యారు. విద్యుత్ తీగలపై దుస్తులు అరేసుకోవాలి అంటే రాసావా..? ఈ మీటర్లు రైతుకు పూర్తి న్యాయం చేసే దిశగా అమరుస్తున్నారన్నారు. ఫీడర్లపై పడే భారం ఎలా ఉంటుందో అంచనా వేయాలంటే మీటర్లు అవసరమని.. వీటి వల్ల రైతుకు ఏ మాత్రం భారం లేదని వివరించారు. సీఎం జగన్ తెచ్చింది ప్రజలకు ఖర్చు పెడుతుంటే బురద జల్లుతున్నారని... పిల్లలు గొప్పవాళ్ళు కావాలనే ఆశయంతో మేము పనిచేస్తుంటే పాడు బుద్దిని వాడుతున్నారని నిప్పులు చెరిగారు. మనోడు సీఎంగా లేడని ఎలాగైనా అప్రతిష్ట చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని... పాతకాలం పోయింది...ప్రజలు తెలివైన వారు..వాళ్ళకి మేలు చేసే వారెవరో వాళ్ళకి తెలుసు అని చురకలు అంటించారు.