కాఫీ ఆ సమయంలో తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!
ఇక బ్రష్ చేయకుండా టీ, కాఫీ, టిఫిన్ చేసినా.. రోగాలు వస్తాయని దంత వైద్యులు చెబుతున్నారు. పళ్లు తోముకోకపోతే నోట్లో బ్యాక్టరీయా పెరిగిపోతుంది. ఏదైనా తినగానే దాంతో పాటు ఆ బ్యాక్టరీయా కడుపులోకి వెళ్లి అనేక వ్యాధులకు కారణం అవుతుంది. కాబట్టి నోట్లో బ్యాక్టరీయా ఉంటుంది కాబట్టి.. బ్రష్ చేసి, టీ, కాఫీ, టిఫిన్ చేయాలి. లేదంటో నోటి దుర్వాసనతో పాటు, చిగుళ్ల సమస్యలు వస్తాయి. అలాగే తాగినా...తిన్నా.. నోట్లో నీరు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయాలి.
చాలా మంది బెడ్ కాఫీ అని.. నిద్రలేవగానే ఆ పాచి నోటితోనే తాగేస్తారు. అలా వాళ్ల లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకొని ఉంటారు. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ అంటున్నారు వైద్య నిపుణులు. నోరు శుభ్రం చేసుకున్న తర్వాతే ఏదైనా తాగాలి అంటున్నారు. లేకపోతే పలు అనారోగ్య సమస్యల భారిన పడొచ్చని సూచిస్తున్నారు.
మరోవైపు కాఫీతో నే కాదు.. కాఫీ గింజలతో కొన్ని ఉపయోగాలున్నాయి. ఇంటి చిట్కాలతోనే అనేక వ్యాధులకు కారణమయ్యే బొద్దింకలను తరమేయవచ్చు. కాఫీ గింజలను పొడిగా చేసి చల్లడం ద్వారా బొద్దింకల బెడద ఉండదు బేకింగ్ సోడాను చక్కెరలో కలిపి అవి ఉండే చోట చల్లితే తిని చస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల వాసనలనూ బొద్దింకలు భరించలేవు. ఈ మిశ్రమాన్ని ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో స్ప్రే చేస్తే చాలు.. అవి ఇంటి నుంచి వెళ్లిపోతాయి.