కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

praveen
మరికొన్ని రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి.  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రస్తుతం అందరికీ వరాల జల్లు కురిపిస్తున్నారు.  హుజురాబాద్ ప్రజలను ఆకర్షించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు కెసిఆర్.  ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి హుజురాబాదు నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయిస్తారు.



 అంతేకాదు సరికొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతూ ఎంతోమంది దృష్టిని ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్  ఇప్పటికే దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి కెసిఆర్ సంచలనమే సృష్టించారు అని చెప్పాలి. దళిత బంధు ద్వారా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కెసిఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ దళిత బంద్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంతోమంది దళిత కుటుంబాల ఖాతాలో 10లక్షల రూపాయల జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.


 హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే తాము ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని అంటూ ఏకంగా మీడియా ముందే నిర్మొహమాటంగా చెప్పేశారు కెసిఆర్. ఇకపోతే ఇప్పుడు మరో పథకాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది   త్వరలో ఏకంగా 2 లక్షల మంది కల్లుగీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు  ఇక ఈ పథకంలో భాగంగా మొదటి దశలో 15 వేల మంది లబ్ధిదారులకు మోపెడ్స్ అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఈ పథకం అమలు కోసం ఏకంగా 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ అనుమతి రాగానే ఈ పథకాన్ని అమలులోకి తీసుకు వస్తాము అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: