షర్మిలక్క... తక్షణ కర్తవ్యం ఇదే ?
అయితే షర్మిల పార్టీలో మహిళలే అధికంగా చేరుతున్నారు చేరారు కూడా, ఇంతలోనే షర్మిలకు గట్టి షాక్ తగిలింది... నిన్ననే తెలంగాణ వైఎస్సార్ పార్టీ కి చెందిన నేత ఇందిరా శోభన్ షర్మిలను కలిసి తన రాజీనామాను సమర్పించారు. ఆదిలోనే ఇలా ఆటంకం కలగడం నిజంగా దురదృష్టమని అంటున్నారు. షర్మిల దగ్గర ఉన్న వారంతా ఒక చెత్త అని, ఆ పార్టీ ఎదుగుదల చాలా కష్టం, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇందిరా శోభన్ తెలిపారు. పార్టీలో ఉన్న నాయకులను నిలబెట్టుకోలేని అయోమయ స్థితిలో షర్మిల ఉన్నారా అంటూ విమర్శల వెల్లువ మొదలైంది. అసలు పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. కానీ పార్టీ నుండి బయటకు వెళ్ళే వారి సంఖ్య పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి షర్మిల ఎక్కడ పొరపాటు చేస్తున్నారో అన్నది ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.
పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికను ఒక సవాలుగా తీసుకుని ఎంత వరకు ప్రజలు పార్టీకి మద్దతు ఇస్తారో తెలుసుకోవాల్సిన సరైన సమయం ఇది. మరి షర్మిల ఏ విధంగా స్పందిస్తుందో ? మరిన్ని రాజీనామాలు జరగకుండా అడ్డుకుంటుందా ? హుజూరాబాద్ లో తన బాధ్యత ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.