దైవ ప్రసాదం.. ప్రాణం మీదికి తెచ్చింది?
కానీ ఇక్కడ మాత్రం ఆయురారోగ్యాలతో ఎంతో ఆనందం గా ఉండేందుకు తీసుకున్న దేవుడి ప్రసాదం ఏకంగా ప్రాణాల మీదికి తెచ్చింది అని చెప్పాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దైవ ప్రసాదం కారణం గా 80 మంది అస్వస్థతకు గురి కావడం సంచలనం గా మారిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు లోకి వచ్చింది. అయితే ఇక ప్రసాదం తిన్న 80 మంది అస్వస్థతకు గురికావడం తో అందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం లోని బండ్లపల్లి లో గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు పంచారు. అయితే ఈ ప్రసాదం తిన్న 80 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక వెంటనే వారిని మదనపల్లి, నిమ్మనపల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే ఇలా అస్వస్థతకు గురైన 80 మందిలో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉండడం గమనార్హం. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా భక్తులందరూ భయంతో వణికిపోయారు.