తాలిబన్ల ముందు.. అమెరికా ఓటమి ఒప్పుకుంది?
అయితే జో బైడెన్ తమ సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ని రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అంతర్జాతీయ సమాజం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన ఓటమి అంటూ వ్యాఖ్యానించారు. తాలిబన్లను నిలువరించడంలో జో బైడెన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంటూ విమర్శలు చేశారు. తాలిబన్ల ముందు జో బైడెన్ ఓటమి అంగీకరించారని.. ఇక చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదానికి.. జో బైడెన్ పాల్పడి ఇక ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులకు కారణం అయ్యారు అంటూ వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఇలా జరగడం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం అంటే తాలిబన్ల ముందు ఓటమిని ఒప్పుకోవడమే.. అమెరికా అంటే తాలిబన్లకు భయం గౌరవం లేకుండా పోయింది. ఏకంగా కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరడం ఎంత అపఖ్యాతి ఊహించుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇది జో బైడెన్ చేతకానితనం వల్లే జరిగింది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక బైడెన్ తీసుకున్న నిర్ణయం అమెరికా ప్రజలు క్షమించరానిది అంటూ వ్యాఖ్యానించారు