అమెరికా అఫ్గాన్‌ చేతిలో అంత సిల్లీగా ఎలా మోసపోయింది..?

Chakravarthi Kalyan
అఫ్గానిస్తాన్ విషయంలో అమెరికా భంగ పడిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంత గొప్ప అమెరికా అంత సిల్లీగా ఎలా మోసపోయందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే.. అమెరికాను సొంత మీడియా ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. అఫ్గాన్ విషయంలో తప్పు చేస్తున్నారని సొంత మీడియా బయటపెట్టింది. అయితే..వాటిని అమెరికా ఏనాడూ పట్టించుకున్న పాపన పోలేదు. ఒకవేళ ఆ కథనాలు చూసినా.. అంత సీన్ లేకపోవచ్చని భావించి ఉండొచ్చు.


ఏదేమైనా అఫ్గాన్ సైన్యం అమెరికాను ఘోరంగా బోల్తా కొట్టించింది. తన రక్షణ కోసం ప్రతిష్ట కోసం అమెరికా ఎంతైనా ఖర్చు చేస్తుందన్న వీక్‌నెస్ ను గుర్తించి అఫ్ఘాన్‌ సైన్యం బాగా లంచాలు మింగింది.  గతంలో ఈ విషయంలో ది వాషింగ్టన్‌ పోస్టు పత్రిక అఫ్గానిస్థాన్‌ పేపర్స్‌ పేరుతో కొన్ని నిజాలు బయటపెట్టింది కూడా. అఫ్గాన్‌ పోలీసులు, సైనికులు కలిపి లెక్కల్లో 3 లక్షల 52 వేల మంది ఉంటే.. వాస్తవంగా 2 లక్షల 54 వేలు మాత్రమే ఉన్నట్లు  ఆ పత్రిక తేల్చి చెప్పింది. అయినా అమెరికా పెద్దగా పట్టించుకోలేదు.


చివరకు.. అఫ్గాన్‌ ప్రభుత్వం కుప్పకూలడానికి 15 రోజుల ముందు కూడా సిగర్‌ నివేదిక అక్కడి పరిస్థితిని తెలిపింది. కాందహార్‌, జుబుల్‌, హెల్మాండ్‌, ఉర్జాన్‌ ప్రావిన్స్‌ల్లో లెక్కల్లో ఉన్న 50శాతం నుంచి 70శాతం వరకు సైనికులు అసలు లేరని ఖరాఖండీగా చెప్పింది. ఇక ఈ పరిస్థితికి తోడు.. అఫ్గాన్ పాలకుల భయాందోళనలు కూడా అక్కడి సైన్యాన్ని ఇరకాటంలో పడేశాయి. కాబూల్లో తాలిబన్లతో యుద్ధం కూడా ప్రారంభం కాకుండానే అధ్యక్షుడు ఏకంగా పొరుగు దేశాలకు పారిపోవడం సైన్యం ధైర్యాన్ని దెబ్బ తీసింది.


అధ్యక్షుడే పారిపోతుంటే.. తాము మాత్రం చేసేదేముందని వారు ఫీలయ్యారు. అందుకే తాలిబన్లకు లొంగిపోయారు. ప్రాణాలు కాపాడుకుంటే చాలని ఫీలయ్యారు. ఇలా అఫ్గాన్ విషయంలో అమెరికా మోసపోయింది. ఈ మోసపోవడం ఒక్క బైడెన్ కాలంలోనే కాదు.. అంతకు ముందు కూడా కొనసాగిందంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: