స్టేట్ బ్యాంక్ భలే ఐడియా.. నీళ్ళల్లో తేలియాడే ఎటిఎం సెంటర్?
ఇక ఇప్పుడు స్టేట్ బ్యాంక్ తీసుకున్న సరికొత్త నిర్ణయం ఈ విషయానికి మరోసారి నిదర్శనంగా మారింది. ఇప్పుడు వరకు కస్టమర్లు అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలలో స్టేట్ బ్యాంక్ ఎటిఎం సెంటర్లు అందుబాటులో ఉండడం చూశామ్. ఇక కస్టమర్లు ఏటీఎం సెంటర్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రస్తుతం చాలా ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేసింది స్టేట్ బ్యాంక్. ఇక ఇప్పుడు కూడా ఇలాగే ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేసింది. మరి ఇందులో స్పెషాలిటీ ఏమిటి అని అంటారా.. అయితే ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలలో భవనాలలో ఎటిఎం సెంటర్ ఏర్పాటు చేయడం చూశామ్. కానీ నీటిలో తేలే ఏటీఎం ఎప్పుడైనా చూసారా. హవ్వా.. నీటిలో తేలే ఎటియమా.. ఇలా ఎక్కడైనా ఉంటుందా గురువుగారు అని ఆశ్చర్య పోతున్నారు కదా.
కానీ నేను చెప్పింది అక్షరాల నిజం స్టేట్ బ్యాంక్ త్వరలో నీటిలో తేలియాడే ఒక ఏటీఎం ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు లో ఫ్లోటింగ్ ఏటీఎం ను ప్రారంభించింది. స్థానికులు, టూరిస్టులకు సేవలు అందించేందుకు హౌస్ బోట్ లో దీన్ని ప్రారంభించారు అధికారులు. ఇక తద్వారా ఎంతో మంది స్థానికులకు, టూరిస్టులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది అని స్టేట్ బ్యాంక్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలా స్టేట్ బ్యాంక్ కస్టమర్ అవసరాల కోసం ఫ్లోటింగ్ ఎటిఎం ఏర్పాటు చేయడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక మిగతా బ్యాంకులు కూడా ఇలాంటి ఏటీఎంలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.