క్రికెట్ ఫాన్స్ కి.. గుడ్ న్యూస్ చెప్పిన తాలిబన్లు.. కీలక నిర్ణయం?
దీంతో అక్కడి ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రెండు దశాబ్దాల కిందట ఇదే రీతిలో ఆదిపత్యాన్ని సాధించిన తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసీ చట్టాలు అమలులోకి తెచ్చారు. మహిళలను బానిసలుగా చూడటం ఎదురు తిరిగిన వారిని దారుణంగా చంపేయడం లాంటివి చేశారు. అంతేకాదు అప్పట్లో తాలిబన్లు క్రికెట్ పై కూడా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి రావడంతో క్రికెట్ సహా మిగతా క్రీడలపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు.
దీంతో తమ భవిష్యత్తు ఏంటో అని ఆందోళన మునిగి పోయారు అందరు ఆటగాళ్లు. ముఖ్యం గా టి20 వరల్డ్ కప్ ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కు మద్దతు పలకడం సంచలనంగా మారిపోయింది. తాలిబన్ల నాయకుడు అనీష్ హక్కని ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు, క్రికెట్ బోర్డు సభ్యుల తో సమావేశమై క్రికెట్ కు అండగా ఉంటాము అంటూ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇక మరికొన్ని రోజులలో జరగబోయే టి20 వరల్డ్ కప్ కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియర్ అయింది అన్నది అర్ధమవుతుంది.