చంద్రబాబు చాణక్యత లోకేష్ లో ఉందా ?
ప్రభుత్వం ఏ పొరపాటు చేసినా ప్రజల తరపున తన వాణిని వినిపిస్తున్నాడు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలే ఈ మధ్య నెల్లూరు పర్యటన అలాగే, మొన్న జరిగిన గుంటూరు బి టెక్ విద్యార్థిని రమ్య హత్యపై కుటుంబ సభ్యులను పరామర్శించడం. ఈ పరిణామాలన్నీ చెప్పకనే చెబుతున్నాయి చంద్రబాబు నాయుడు లోకేష్ ను తన తరువాత నాయకుడిగా తీర్చి దిద్దుతున్నారని. అయితే రాజకీయ ప్రముఖులకు లోకేష్ పై ఉన్న అభిప్రాయం ఏమిటంటే, లోకేష్ ఇప్పుడు పటపటా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళుతున్నాడు. వారిని పరామర్శిస్తున్నాడు. ఓకే కానీ రాజకీయాలలో కావాల్సింది వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించడం. అలాగే ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టడం.
అయితే ఇలాంటి వాటిలో అపరచాణక్యుడిగా పేరున్న చంద్రబాబు లాగా లోకేష్ మారగలడా ? అయితే కాదనే అంటున్నారు వీరంతా, లోకేష్ రాజకీయంగా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. రాజకీయంగా మాటకు మాట ఎదురుచెప్పడమే కాదు. అవసరమా అయినప్పుడు వెనక్కు తగ్గగలగాలి. కాబట్టి ఇంకొంత రాజకీయ అనుభవం రావాలి. అప్పుడే చినబాబును ఆకాశానికి ఎత్తేయడం తగదని సలహాలు ఇస్తున్నారు. మరి లోకేష్ వీటన్నిటినీ సరి చూసుకుని రాజకీయంగా ఇంకొంత సామర్ధ్యాన్ని పెంచుకుంటాడా ? లేదా అన్నది చూడాలి.