మంచి పనికోసం వెళ్తే.. నలుగురు పోలీసులను మింగేసిన ప్రమాదం?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. ఆర్మీ జవాన్ కు సంబంధించి మృత దేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి అంత్య క్రియలకు వెళ్లి వస్తున్న సందర్భంగా పలాస మండలం సుమ్మ దేవి రైల్వే గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలడంతో చివరికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా నలుగురు ఏఆర్ కానిస్టేబుల్ మృత్యువాతపడ్డారు.
పోలీసుల ఎస్కార్ట్ వాహనం ప్రమాదంలో మృతి చెందిన వారిలో.. పి జనార్ధనరావు (హెచ్ సి), కృష్ణం నాయుడు (ఎస్సై), బాబురావు, ఆంటోని (హెచ్ సిలు) ఉన్నారు. అంతా ఎఆర్ కు సంబంధించిన పోలీసులే కావటం గమనార్హం. తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని ఏకంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డిఐజి, జిల్లా ఎస్పీని ఆదేశించారు. విధి నిర్వహణలో నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటు అంటూ పోలీసుల మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డిజీపీ. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబలకు అండగా ఉంటుంది డీజీపీ తెలిపారు.