విజయసాయిరెడ్డిని ఎదుర్కోలేరా... ?

M N Amaleswara rao
విశాఖ సాయిరెడ్డి ఆయనకు మరో పేరు. ఇది వెటకారంగా టీడీపీ కూడా అంటుంది. ఆయనే జగన్ కుడిభుజం ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన ఆరేళ్ళుగా విశాఖలో నివాసం ఉంటున్నారు. ఆయన భారీ భవంతులలో ఉండరు. ఒక అపార్ట్ మెంట్ లో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఆయన నివాసం. ఆయన 2015లో విశాఖ వచ్చాక చాలా తక్కువ టైమ్ లోనే రాజకీయంగా అగ్ర స్థానానికి చేరుకున్నారు. విశాఖకు ఎంతో మంది నాయకులు వలస వచ్చారు. కానీ వారెవరూ సాయిరెడ్డి మాదిరిగా ఇంతలా దూకుడు చూపించలేదు. ఆయన విశాఖను నోడల్ జిల్లాగా చేసుకుని తన ఎంపీ నిధులను ఆ ప్రాంతానికే ఖర్చు చేస్తున్నారు. విజయసాయిరెడ్డిలో మల్టీపుల్ టాలెంట్ ఉంది. ఆయన క్లాస్. ఆయన పక్కా మాస్ కూడా.


దేశంలో పేరెన్నిక గ‌న్న చార్టర్ అకౌంటెంట్ ఆయన. అదే సమయంలో ఆయన ఏ విషయం మీద అయినా చక్కగా మాట్లాడాలి అంటే తానే ముందుంటారు. ఇక రాజకీయాల్లో మాస్ కావాలి అంటే దానికీ తయారుగా ఉంటారు. ఆయన ముందు టీడీపీకి కంచుకోట లాంటి విశాఖలో తమ్ముళ్ళు తగ్గిపోవాల్సి వస్తోంది. చేతిలో అధికారం లేని సమయంలో కూడా విజయసాయిరెడ్డి వాయిస్ ఎక్కడా తగ్గలేదు. నాడు విశాఖలో టీడీపీ భూ దందాను వెలికి తీసి రచ్చ చేసింది కూడా ఆయనే. ఇపుడు వరస దాడులు చేయిస్తూ అక్రమార్కులకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నది కూడా ఆయనే.

ఆయన్ని గట్టిగా విమర్శించాలన్నా కూడా విపక్షాలు జంకుతాయి. ఆయన సారధ్యంలో 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రా అంతటా వైసీపీ ఊపేసింది. ఇక ఈ ఏడాది జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. విశాఖలో పెద్ద నాయకులను అందరికీ వైసీపీ గూట్లోకి లాగేసి ఫ్యాన్ పార్టీని పటిష్టం  చేయడమే కాదు టీడీపీకి వణుకు పుట్టించే వ్యూహాలు పన్నడంతో విజయసాయిరెడ్డి స్టైలే వేరు అంటారు. మొత్తానికి చూస్తే సాయిరెడ్డి విశాఖలో ఉండగా విపక్షానికి ఇబ్బందే అన్న మాట అయితే ఉంది. మరి ఆయన్ని ఢీ కొట్టి నిలిచే వారుంటేనే రేపటి రోజున గెలుపు పిలుపు వినిపించేది. మరి దీని కోసం టీడీపీ ఏం చేస్తుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: