మందు తాగొద్దు అన్న కూతురు.. తల్లి చేసిన పనికి షాక్?

praveen
మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్ కు కారకం..  ఎక్కడ చూసినా ఇలాంటి బోర్డులు కనిపిస్తూ ఉంటాయ్. ఇక సినిమా థియేటర్ కి వెళ్తే ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయినప్పటికీ అటు జనాలలో మాత్రం మార్పు రావడంలేదు. మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలని ఎంత చెప్పినా రోజు రోజుకు మరింత దగ్గరవుతున్నారు తప్ప ఎక్కడ దూరం అవడం లేదు. దీంతో రోజు రోజుకు  మద్యపానానికి బానిసలుగా మారిపోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.



 ఇక మద్యపానం ఎంతో మందిని  బానిసలుగా మార్చుకుంటుంది. అదే సమయంలో మద్యపానం కారణంగా పోతున్న ప్రాణాలు కూడా రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఫుల్లుగా మద్యం తాగి ఇక నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం చివరికి రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం లేదా జీవచ్ఛవాలుగా మారి పోవడం లాంటివి ఎంతో మంది విషయంలో జరుగుతున్నాయి. మద్యపానం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది.  అయితే ఇక్కడ మద్యానికి బానిసగా మారింది ఓ తల్లి. అయితే తీరు మార్చుకోవాలి అంటూ కూతురు హెచ్చరించింది. దీంతో ఏకంగా కూతురికి షాకిస్తూ తల్లి ఇంట్లో నుంచి పారిపోయింది.



 ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రహ్మత్ నగర్ కు చెందిన 55 ఏళ్ల సువర్ణ కూతురు ఇంట్లో ఉంటుంది. అయితే సువర్ణ కు తరచు మద్యం తాగే అలవాటు ఉంది   ఇటీవలి కాలంలో ఏకంగా మద్యానికి బానిస గా మారి పోయింది ఆమె.  ఈ క్రమంలోనే ఇక తల్లి తీరుతో విసిగి పోయిన కూతురు మద్యం మానేయాలంటూ ఇటీవలే ఏకంగా ఆ తల్లికి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇంట్లో స్వేచ్చ లేదు అంటూ తన కూతురుతో వాదించిన తల్లి నుంచి వెళ్లిపోయింది. రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: