తాలిబన్లకు షాక్.. ప్రపంచ బ్యాంక్ సంచలన నిర్ణయం?

praveen
ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్  తాలిబాన్లు  ఆయుధాలతో కొన్ని రోజులపాటు అరాచకాలు సృష్టించి  ఎన్నో నగరాలను స్వాధీనం చేసుకొని చివరికి అక్కడి ప్రభుత్వం లొంగిపోవడంతో దేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరిని కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరికొన్ని రోజుల్లో ఇక ఆఫ్ఘనిస్తాన్లో తమ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతే కాకుండా ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి విధి విధానాలు ఎలా  ఉండబోతున్నాయి అనే విషయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.



 ఇదిలా ఉంటే తాలిబన్ల ఆక్రమణలను మాత్రం అంతర్జాతీయ సమాజం అసలు అంగీకరించడం లేదు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఇంకా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేదు ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు తాలిబన్లకు ఊహించని షాక్ ఇస్తున్నాయ్. ఇప్పటికే జర్మనీ ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ కు సహాయం చేసేందుకు ఇవ్వాలనుకున్న మూడువేల కోట్ల ను ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. మరోవైపు అమెరికా  తమ దేశ బ్యాంకులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నిధులను ఇప్పుడు విడుదల చేయబోమని అంటూ తెలిపింది. దీంతో అటు తాలిబన్లకు ఊహించని షాక్ తగిలింది



 ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తాలిబన్లకు  అటు ప్రపంచ బ్యాంకు కూడా ఊహించని షాక్ ఇచ్చింది. తాలిబన్లు అధికారంలో దేశ భవిష్యత్తు మహిళల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచబ్యాంకు. ప్రజలందరికీ తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అని తెలిపింది.  ఆఫ్ఘనిస్తాన్కు ఐఎంఎఫ్ నిధులు నిలిపివేసిన  కొన్ని రోజుల్లోనే  ప్రపంచ బ్యాంకు కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు  తాలిబన్లను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాలిబన్లకు  రోజురోజుకు ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాలిబన్లు   ఏం చేయబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: