మళ్ళీ రాజకీయాల్లోకి బండ్ల గణేష్.. ఈసారి టిఆర్ఎస్ లోకా?
2019 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్.. ఇక అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని.. అలా గెలవకపోతే ఏకంగా సెవెన్ ఎం ఎం బ్లడ్ తో తన చెయ్యి కోసుకుంటా అంటూ ఛాలెంజ్ సైతం చేశాడు బండ్ల గణేష్. ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతల కంటే ఎక్కువగా మాట్లాడి అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇక బండ్ల గణేష్‌కు అప్పటికే సినిమాల్లో బాగా క్రేజ్ ఉండటంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ బండ్ల గణేష్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపాయి. ఇక ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాలకు దూరం అయిపోయాడు.
అప్పటి వరకు అన్ని ఇంటర్వ్యూలో కూడా తన మాటలతో రచ్చ చేసిన బండ్లగణేష్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడూ. ఇక ఆ తర్వాత బండ్ల గణేష్ కాస్త బ్లేడ్ గణేష్ గా మారిపోయాడు. ఇక పోతే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో బండ్లగణేష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా అంటే ఇక ఇటీవల చెప్పిన మాటతో మాత్రం అవును అనిపిస్తుంది. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కి బండ్ల గణేష్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఇక ఒక సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమాకు నిర్మాతగా పనిచేశారు. మరి ఒకసారి రాజకీయాల్లో ఫెయిల్ అయితే మళ్లీ ఎందుకు రాజకీయాల్లోకి రారు? రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా లేక టిఆర్ఎస్ కండువా కప్పు కుంటారా? అని యాంకర్ అడుగగా.. ఇన్నాళ్ళ వరకు ఎందుకులే రాజకీయాలు అని అనుకున్నాను. నువ్వు ఇలా చెప్పిన తర్వాత మళ్లీ ఇంటికెళ్ళి దీని గురించి బాగా ఆలోచించాలి అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఇక మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నాడేమో అన్న ప్రచారం మొదలైంది.