హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి మనకు విధితమే. అయితే ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేక వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్న దళితుల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి ఏకంగా 10 లక్షల రూపాయలను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం లో బలంగా ఉన్న లీడర్లను కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు లాగేసుకున్నారు గులాబీ బాస్. కౌశిక్ రెడ్డి మరియు పెద్ది రెడ్డి లాంటి కీలక నేతలతో పాటు ఈటల రాజేందర్ అనుచరులను కూడా టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇక అటు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కు పూర్తిగా హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. అలాగే ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ మంత్రులు హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా మరో స్కెచ్ వేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇవాళ సాయంత్రం కరీంనగర్ జిల్లాకు పయనమయ్యారు. ఇవాళ రాత్రి కరీంనగర్ జిల్లా లోని తీగల కుంట పల్లి లో ముఖ్యమంత్రి కెసిఆర్ బస చేయనున్నారు. రేపు ఉదయం కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీసు లో.... దళిత బంధు పథకం మరియు హుజురాబాద్ ఉప ఎన్నిక పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే ఈటల రాజేందర్ ను ఓడించేందుకు పార్టీ కార్యకర్తలకు మరియు కీలక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. దీని కోసం రెండు రోజులు కరీంనగర్ జిల్లాలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇక కేసీఆర్ చేసే వ్యూహరచనలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.