షాకింగ్ : పెళ్లి కావట్లేదని.. ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఏం చేసాడో తెలుసా?
ఇలా ఎన్నో ఆశలు ఎన్నో అంచనాలతో ఎంతో మంది పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం పెళ్లి అనేది కలగానే మారిపోతూ ఉంటుంది. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక విధంగా పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది ఉంటుంది. నేటి రోజుల్లో పెళ్లి జరగటం లేదు అనే కారణంతో మనస్థాపం చెంది ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మంచి ఉద్యోగం మంచి వేతనం ఉన్నప్పటికీ కూడా ఎంతో మందికి ఇటీవలి కాలంలో పెళ్ళి జరగడం లేదు. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది.
కామారెడ్డి జిల్లాకు చెందిన రాజ్ కుమార్ బాగా చదువుకున్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. ప్రస్తుతం మంచి వేతనం కూడా ఉంది. కానీ అతనికి పెళ్లి మాత్రం కావడం లేదు. ఓ మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజకుమార్ కరోనా వైరస్ నేపథ్యంలో స్వగ్రామంలోనే వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అయితే గత నాలుగేళ్ల నుంచి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఎన్ని సంబంధాలు చూస్తున్న సెట్ కావడం లేదు. దీంతో ఎంతో మనస్తాపం చెందాడు రాజ్ కుమార్. తనకు పెళ్లి కాదు అని భావించాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.