నెక్స్ట్ టార్గెట్ భారత్.. అప్రమత్తమైన ఆర్మీ?
భారత్లో మరోసారి మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారట. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ లో విమానాశ్రయంలో బాంబు బ్లాస్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను తమ వశం చేసుకున్న తర్వాత ఇక దేశం నుంచి ఎవరు పారి పోకుండా ఉండేందుకు కాబుల్ విమానాశ్రయంలో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఏకంగా బాంబ్ బ్లాస్టింగ్ జరగడం సంచలనంగా మారిపోయింది. ఈ బాంబు బ్లాస్ట్ లో వంద మందికి పైగా మరణించారు.
ఇక ఈ బాంబు బ్లాస్ట్ కు తామే బాధ్యులం అంటూ ఐసీస్ కే ఉగ్రవాద సంస్థ ప్రకటించడం మరింత సంక్లిష్టంగా మారిపోయింది. మిడిల్ ఈస్ట్ జిహాది ఎజెండా తో ఏర్పడిన ఐసిస్ కె ఉగ్ర సంస్థ ఇక నెక్స్ట్ టార్గెట్ భారత్ పైనే దృష్టి సారించినట్లు ప్రస్తుతం భారత ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం అందిందట. భారత్లో వరుసగా దాడులకు పాల్పడటం భారత్లోని యువతను ఉగ్ర సంస్థల వైపు ఆకర్షించడమే లక్ష్యంగా భారత్ ను టార్గెట్ చేసుకుందట ఐసిస్ కే సంస్థ. భారత్లో కూడా ఇస్లాం పాలన తీసుకురావాలి అని ఎజెండాతో.. భారత్లో త్వరలో ఎంతోమంది స్లీపర్ సెల్స్ ని కూడా ప్రారంభించాలని ప్రస్తుతం ఐసీస్ కె సంస్థ భావిస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో భారత ఆర్మీ ఒక్కసారిగా అప్రమత్తమైంది.