బండ్ల చెప్పిన కథ : రేవంత్ మరియు ఓ దేవకన్య !
కాంగ్రెస్ తన పూర్వ వైభవానికి
ప్రయత్నించాలి.. ప్రయత్నించాలి అనే కన్నా
పెద్ద యుద్ధమే చేయాలి
ఎవరు ఏం చెప్పినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఈ మాట గణేశ్ చెప్పాడు. గుర్తుందిగా ఇంటి పేరు బండ్ల. ఆ రోజు నేను చెప్పిన మాటల్లో ఏం తప్పూ లేదండి..ఓ పార్టీ ఎన్నికల సంగ్రామంలో ఉన్నప్పుడు వందకు పైగా సీట్లు వస్తాయి అని చెప్పడం జ్యోతిషం కాదు అది కేవలం కార్యకర్తలను ఉత్సాహపరిచే మార్గం..అని కూడా వ్యాఖ్యానించాడు. ఓ డిజిటల్ మీడియా ఇంటర్వ్యూ లో బండ్ల గణేశ్ చా లా విషయాలు చెప్పి, గత ఎన్నికల సమయంలో తానెందుకు ఆ విధంగా వ్యవహరించాల్సి వచ్చిందో స్పష్టం చే శాడు. అదేవిధం గా కేసీఆర్ పాలన బాగుందనీ కితాబిచ్చాడు. తన జీవితాన్ని మేలి మలుపు తిప్పిన పవన్ తోనే సినిమా చేస్తాన ని మరొకరితో చేయన ని తేల్చేశాడు. ఈ సందర్భంగా ఆంధ్రాలో పవన్ సీఎం కావాలని, తెలంగాణలో రేవంత్ సారథ్యంలో పార్టీ అధి కారంలోకి రావాలని తాను బలీయంగా కోరుకుంటున్నానని చెప్పారు.
ఇప్పుడే చెప్పను
చెప్పేదాకా
మీరు ఒప్పుకోరు
చెప్పాక
నన్ను ఉండనివ్వరు
వచ్చే ఎన్నికల్లో ఏ కండువా కప్పుకుంటారు అన్న ప్రశ్నకు ఆగండి ఎన్నికల ముందే ఏదయినా చెబుతాను ఇప్పుడు చెప్పానంటే మీరు ఏదో ఒక కాంట్రవర్శీలో నన్ను లాగుతారు అంటూ వ్యంగ్య ధోరణిలో జవాబు ఇచ్చాడు. కేసీఆర్ పాలన బాగుంటే రేవంత్ ఎ లా నెగ్గుకు రాగలడు అన్న ప్రశ్నకు అత్యంత తెలివి తనంతో సమాధానం చెప్పాడు. ఎంత భార్య దేవకన్య అయినా కొంత కాలమే క దండి తరువాత మనం మరో అందమయిన అమ్మాయి వైపు చూడకుండా ఉండగలమా..అదేవిధంగా ప్రజలు మరో అవకాశం కాం గ్రెస్ కు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రశ్నించాడు. అదేవిధంగా ఇంటర్వ్యూలో చాలా చోట్ల కేసీఆర్ ను సమర్థించాడు. ఆయన పాల సీలకూ మద్దతు ఇచ్చాడు.
రాజశేఖర్ రెడ్డి అమ్మాయిగా
షర్మిల అంటే గౌరవం అభిమానం
మా ఎన్నికలపై కూడా తనదైన కౌంటర్ ఇచ్చాడు. షర్మిల రాకపై తన స్పందన చెప్పనని కూడా అన్నాడు. చాలా చాలా నర్మ గ ర్భంగా మాట్లాడి తాను కాంట్రవర్శీలకు దూరం అని స్పష్టం చేసే ప్రయత్నం ఒకటి చేస్తూనే..ఇటీవల తనకు ఆరోగ్య ప్రదాతగా నిలి చిన చిరంజీవికి పాదాభివందనం చేశాడు. ఆఖరుగా తెలంగాణ వాకిట జరిగే ఈ ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్య పోరే అని, బీజేపీకి సంబంధమే లేదని తేల్చేశాడు.