హమ్మయ్య.. ట్రంప్ దారిలోకి వచ్చిన బైడెన్?
అయితే ఈ క్రమంలోనే గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో కరోనా వైరస్ కు అసలు కారణం చైనా అని చైనాలో వైరస్ ను ఉద్దేశపూర్వకంగానే పుట్టించారు అంటూ ఎన్నో విమర్శలు చేశారు. ఇలా కరోనా వైరస్ కు చైనీస్ కరోనా అంటూ పేరు కూడా పెట్టడం అప్పట్లో సంచలనం గా మారిపోయింది. కరోనా వైరస్ పేరుతో అటు చైనా పై చాలాసార్లు విరుచుకుపడుతూ విమర్శలు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. కానీ ఆ తరువాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పదవిని చేపట్టిన బైడెన్ మాత్రం ఇప్పటివరకు వైరస్ విషయంలో చైనా పై విమర్శలు చేసిన దాఖలాలు మాత్రం లేవు.
దీంతో జో బైడెన్ చైనా కు అనుకూలం అనే విమర్శలు కూడా రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కూడా ట్రంప్ దారిలోకి బైడెన్ వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ విషయంలో చైనాఫై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కరోనా వైరస్ మూలాలు చైనా లోనే ఉన్నాయని కానీ వాటిని బయట పెట్టకుండా చైనా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అందుకే సైంటిస్టులు ఇన్వెస్టిగేటర్ లకు దర్యాప్తు జరిపేందుకు సరైన అనుమతి కూడా ఇవ్వడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. చైనాలో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ అక్కడి ప్రజలను వైరస్ తో బాధపడుతున్నప్పటికీ ఈ విషయాలను కూడా బయట పెట్టడం లేదు అని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మూలాలపైన ఉన్న సందేహాలను కేవలం చైనా మాత్రమే నివృత్తి చేయగలదు అంటూ అమెరికా ఉన్నతాధికారులు కూడా వ్యాఖ్యానించారు.