మా సిఎం వెస్ట్.. కెసిఆర్ కు ఏపీ టిడిపి ఎమ్యెల్యేల వినతి ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు  కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు రాశారు.  ఈ  టీడీపీ ఎమ్మెల్యేల లో గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు వివాదం నేపథ్యం లో సిఎం కెసిఆర్ కు లేఖ రాశారు టీడీపీ ఎమ్మెల్యేలు.   వెలుగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవనడం సరికాదని.. కేంద్ర గెజిట్ లో ప్రాజెక్టు ను చేర్చకపోవడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర   ప్రభుత్వ వైఫల్యమని లేఖ లో వివరించారు టీడీపీ ఎమ్మెల్యేలు. 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులకు అనుమతి ఉందని.. అందు లో కల్వకుర్తి, నెట్టెంపాడు సహా వెలుగొండ ప్రాజెక్ట్ లు  ఉన్నాయని పేర్కొన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఏపీ సిఎం జగన్ రెడ్డి నిర్లక్ష్యం, చేతగాని తనం తో కేంద్ర గెజిట్ లో చేర్చ లేదని వారు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తప్పిదాలకు ప్రజల్ని, రైతాంగాన్ని బాధితుల్ని చేయడం సరికాదని తెలుపారు టీడీపీ ఎమ్మెల్యేలు. ప్రకాశం జిల్లా కరువు తీర్చే ఏకైక పరిష్కారం వెలిగొండ ప్రాజెక్ట్ అని పేర్కొన్న టీడీపీ ఎమ్మెల్యేలు.. సాగు, తాగు నీటి కష్టాలు తీర్చ గల ఏకైక భరోసా వెలిగొండ అని సిఎం కేసీఆర్ కు విన్నవించారు.  


ఏపీ ప్రభుత్వ చేత గాని తనాన్ని సాకు గా చూపి జిల్లా పై కక్ష సరికాదని.. ప్రాజెక్టుల నిర్వహణ పై పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్, సెక్షన్ 85(7ఈ) వెలుగొండకు అనుమతులు ఉన్నాయని లేఖలో వివరించారు.  లేవంటే నెట్టెం పాడు, కల్వకుర్తి కి కూడా లేనట్లేనని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.  ప్రకాశం జిల్లా కు శాపంలా జగన్ రెడ్డి ప్రభుత్వ మొద్దు నిద్ర పోతుందని నిప్పులు చెరిగారు. కరువు పీడిత జిల్లా ప్రాజెక్టు పై అర్ధం లేని ఫిర్యాదులు బాధాకరమన్నారు. విభజన చట్టం, జిల్లా పరిస్థితి ని గుర్తించి లేఖ, ఫిర్యాదు ఉప సంహరించు కోవాలని కోరారు టీడీపీ ఎమ్మెల్యేలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: