కొత్త ఛీప్.. కొత్త ఊపు.. టీఆర్ఎస్ కు షాకేనా?

praveen
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అయినా ఇంత హడావిడి ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాత్రం అటు తెలంగాణ రాజకీయం రోజురోజుకు వాడివేడిగా మారిపోతూనే ఉంది.  ఎవరికి వారు తమదైన వ్యూహాలతో హుజురాబాద్ ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. అంతేకాదు ఇక పాదయాత్రలతో ప్రజలకు చేరువ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.



 అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవాన్ని సాధించేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే ఇక తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకు సాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అధికార పార్టీ పై  రేవంత్ రెడ్డి ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను మరింత హాట్ హాట్ గా మారుస్తున్నాడు .  ఇప్పటికే బండి సంజయ్ ఒక పాదయాత్ర చేపట్టారు..  అంతకుముందు ఈటెల రాజేందర్ పాదయాత్ర చేపట్టారు.


 ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా  పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త చీఫ్ కొత్త ఊపు లో పాదయాత్ర చేపట్టి ఇక పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు గ్రౌండ్ లెవల్ లో క్యాడర్ కు ధైర్యం చెప్పి మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే నెల చివరి నుంచి ఇక పాదయాత్ర కు సంబంధించిన డేట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇక రేవంత్ రెడ్డి పాదయాత్ర అంటే అటు కాంగ్రెస్ శ్రేణులు ఏ రేంజ్ లో తరలివస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక రేవంత్ పాదయాత్ర చేపడితే అటు హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలే అవకాశం ఉంది అని కూడా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: