స్వతంత్ర పోరాటం సాయుధ పోరాటం మావోయిస్టుల అలజడి మనీ కుంభకోణం జరిగిన వాళ్లతో చంచల్ గూడా జైల్ మార్మోగిపోయింది. ఈ సమయంలోనే శిక్షలు పడ్డ వారిని ఎక్కువగా చంచల్ గుడా జైలుకు తరలించేవారు. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రముఖులు సైతం ఒకప్పుడు చంచల్ గుడా జైలుకు ఏళ్ల తరబడి వెళ్ళిన వారే. నిజాం కాలంలో నిర్మించినటువంటి ఈ జైలు ఇప్పుడు కాల గర్భంలో కలిసి పోతుందా..? దీన్ని కూల్చి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుందా..? ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి చూస్తే చంచల్ గుడా జైలు మరికొద్ది రోజుల్లో మనకు కనిపించదు కావచ్చు. కేవలం
చరిత్ర పుస్తకాల్లో మాత్రమే కనిపించనుంది. ఇంతకీ చంచల్గూడ జైలుకున్న ప్రత్యేకత ఏమిటి..? దానిని ఎందు కు కూల్చివేయాలను కుంటున్నారు.
1876 సంవత్సరంలో ఆరవ నిజాం కాలంలో చంచల్గూడా జైలును నిర్మించారు. నవాబ్ ఖాన్ బహదూర్ మిర్జా అనే శిల్పి ఈ జైలుకు నిజాం ఉల్ మిల్క్ అనే పేరు పెట్టి నిర్మించారు. వెయ్యి మంది ఖైదీలు ఉన్న సామర్థ్యంతో ఉండే ఈ జైల్ విస్తీర్ణం 49. 32 ఎకరాలు. 4 వాచ్ టవర్లలో పకడ్బందీగా పక్కాగా నిఘా ఉండేవిధంగా దీన్ని నిర్మించారు. 2016లో దీనిని ఆధునీకరించారు. శిథిలావస్థకు చేరుతుందన్న క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సుందరంగా తయారుచేసినది. ఇందులో ఖైదీల శిక్షణ మాత్రమే కాకుండా వారి ప్రవర్తన మారే విధంగా విశాలంగా నిర్మించారు. చంచల్గూడ జైలులో కరుడు కట్టిన నేరస్తులను మాత్రమే తరలించేవారు.
అయితే స్వతంత్ర సాయుధ పోరాట సమయంలో వ్యతిరేకంగా ఉన్న వారిని ఇందులో ఏళ్ల తరబడి ఉంచారు. ప్రస్తుతం
గవర్నర్ అయిన
బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ జైలును సందర్శించారు. ఎమర్జెన్సీ కాలంలో తాను ఈ ఏడాది పాటు ఈ జైలులో గడిపానని తెలిపారు. 2015లో మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, చర్లపల్లి, చంచల్గూడా జైలు తరలించి రెసిడెన్సి
స్కూల్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. హోం
మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నేటి హోంమంత్రి మహమ్మద్
అలీ సైతం ప్రకటించారు. కానీ ఆచరణలో ముందుకు సాగలేదు.