తాలిబన్ల చేతికి అమెరికా ఆయుధాలు.. భారత్‌కు పెనుముప్పు..?
అయితే ఇప్పుడు ఆ ఆయుధాలు భారత్‌కు ముప్పుగా మారబోతున్నాయన్న వాదన ఉంది. తాలిబన్ల చేతుల్లో ఉన్న ఈ ఆయుధాలు.. పాక్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లడానికి ఎక్కువ కాలం పట్టే అవకాశం లేదు. అసలే అత్యాధునిక ఆయుధాలు.. ఇవి పాక్ ఉగ్రవాదుల చేతికి చేరితే.. వాటి ద్వారా మన సరిహద్దుల్లో అలజడి సృష్టించే ప్రమాదం ఉంది. పెద్ద పెద్ద ట్యాంకర్లు, వాహనాలు, ట్రక్కులతో పెద్దగా ప్రమాదం లేదు కానీ.. లక్షల కొన్ని మెషీన్ గన్లు, నైట్ విజన్ గాగుల్స్, వైరలెస్ కమ్యూనికేషన్ సెట్లతో పెను ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఆయుధాల వివరాల్లోకి వెళ్తే.. అమెరికా దాదాపు 64,000 మెషీన్ గన్లు అఫ్గాన్‌లో వదిలి వెళ్లింది. వీటిలో చాలావరకూ పని చేయనివే.. కానీ.. ఓ 5 వేల మెషీన్ గన్లు మాత్రం కొత్తవి ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి భారత్‌కు ప్రమాదకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే.. వీటి స్పేర్ పార్టులు పాక్‌లో దొరుకుతాయి. అందువల్ల వీటిని తాలిబన్లు వాడుకునే అవకాశం ఉంది.
దాదాపు 1,50,000 వరకూ వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్స్ ఇప్పుడు తాలిబన్ల వద్ద ఉన్నాయి. ఇవి పాక్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళితే భారత్‌కు సరిహద్దుల్లో ముప్పు తప్పదు. వీటి సాయంతో ఉగ్రవాదులు మన సరిహద్దులు దాటే ప్రమాదం ఉంది. ఇవే కాకుండా నైట్ విజన్ గాగుల్స్ ఓ 16 వేల వరకూ తాలిబన్ల వద్ద ఉన్నాయి. అవి కూడా భారత్‌కు చాలా ప్రమాదకరం. ఇలాంటి వైర్లెస్ సెట్, గాగుల్స్, రైఫిల్స్ అన్నీ ఉంటే.. ఆ తీవ్రవాదులను అడ్డుకోవడం చాలా కష్టంగా మారుతుంది.