థర్డ్ వేవ్ పై ఎయిమ్స్ కీలక ప్రకటన..!
మరోవైపు తెలంగాణలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కరోనా కంట్రోల్ లోనే ఉందనీ.. మళ్లీ కొత్త రకం, ప్రస్తుత వేరియంట్ల కన్నా శక్తివంతమైన వైరస్ వస్తే తప్ప థర్డ్ వేవ్ రాదని అభిప్రాయపడ్డారు. ఐదు కంటే ఎక్కువ కేసులు వస్తే వారం పాటు ఆ స్కూలు మూసివేయాలనీ.. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందికే స్కూళ్లలోకి అనుమతించాలన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ వేసుకున్న వారికే మాల్స్ లోకి అనుమతి ఉంటుందని ఆయన అన్నారు.
దేశంలో 5 నుండి 18ఏళ్ల లోపు చిన్నారులకు మరో టీకా అందుబాటులోకి రానుంది. దేశీయ సంస్థ బయోలాజికల్-ఇ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు 2, 3దశల క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. టీకా భద్రత, చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి స్పందనలు ఎలా ఉన్నాయనే అంశంపై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
ఇక తాజాగా భారత్ లో 24గంటల్లో కొత్తగా 47వేల 092కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ నుంచే 32వేల 803కేసులున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 28లక్షల 57వేల 937కు చేరాయి. మరో 509మంది మహమ్మారికి బలికాగా.. మొత్తం మృతుల సంఖ్య 4లక్షల 39వేల 529కి పెరిగింది. నిన్న 35వేల 181మంది కోలుకోగా... మొత్తం రికవరీల సంఖ్య 3కోట్ల 20లక్షల 28వేల 825కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 89వేల 583యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24గంటల్లో 81లక్షల 9వేల 244మంది టీకా తీసుకున్నారు.