ఆఫ్ఘాన్ లో హృదయ విదారక ఘటనలు..!

NAGARJUNA NAKKA
ఇన్ని రోజులుగా ఏదో ఓ దేశ విమానం ఎక్కి దేశం దాటి పోదాం అనుకున్న ఆఫ్ఘాన్ ప్రజలకు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. కాబూల్ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఆ దేశ ప్రజలు ఇప్పుడు రోడ్డు మార్గంలో పాకిస్థాన్ లేదా ఇరాన్ కు వెళ్లేందుకు వేలాదిగా తరలుతున్నారు. దీంతో ఇరు దేశాలు సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశాయి. మరోవైపు దేశంలో త్వరలో పాలన సాగించేందుకు తాలిబన్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక ఆప్ఘానిస్థాన్ లోని హెరాత్ కు చెందిన ఫరీబా అకేమీ.. తాలిబన్ గా మారిన తన భర్త చేతిలో హింసలు భరించలేక భారత్ కు వలస వచ్చింది. వీళ్లకు నలుగురు ఆడపిల్లలు. భర్త డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు. నష్టాలు రావడంతో కూతుళ్లను అమ్మకానికి పెట్టాడు. పద్నాలుగేళ్ల కూతురిని 5లక్షల రూపాయలకు తాలిబన్ల చేతుల్లో పెట్టేశాడు. ఇప్పుడు ఇండియాలో ఉంటున్న ఫరీబా ఆప్ఘాన్ లో ఉన్న తన వాళ్లను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటోంది.

మరోవైపు ఆఫ్ఘాన్ చిన్నారిని ఎత్తుకొని లాలించిన ఓ సైనికురాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కదిలించింది. ఆ అమెరికా సైనికురాలి కథ విషాదంగా ముగిసింది. కాబుల్ పేలుళ్లలో ఆమె మరణించింది. అమెరికా సైన్యం తరఫున ఆఫ్ఘాన్ లో పనిచేస్తున్న సార్జెంట్ నికోల్ ఎల్ గీ అనే సైనికురాలు, ఓ పసికందును లాలించిన ఫోటోను అమెరికా రక్షణ శాఖ పోస్టు చేసింది. ఇది వైరల్ అయిన ఆరు రోజులకే ఆమె చనిపోయింది.

ఇక తాలిభన్లను పంజ్ షీర్ దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. పంజ్ షీర్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నించే క్రమంలో తాలిన్లు వందల సంఖ్యలో తమ ఫైటర్లను కోల్పోయారు. ఇటీవల ఖవాక్ దగ్గర జరిగిన యుద్ధంలో సహా ఇప్పటి వరకు 350మంది తాలిబన్ ఫైటర్లను మట్టుబెట్టినట్టు పంజ్ షీర్ దళాలు ప్రకటించాయి. మరో 40మందికి పైగా తాలిబన్ ఫైటర్లను పట్టుకొని ఖైదు చేసినట్టు చెప్పాయి.







 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: