"జగన్ - వైఎస్" కాగలడా... ప్రజలేమంటున్నారు ?
మొదట్లో ప్రజలు వైఎస్ తీసుకొచ్చిన గొప్ప గొప్ప పధకాల పట్ల చాలా ఆకర్షితులయ్యారు. అందుకే ఈ రోజుకీ అయాన్ చనిపోయినా ప్రజలలో ఇంకా బ్రతికే ఉన్నాడు అనే పేరును సార్ధకం చేసుకున్నాడు. వైఎస్ చేసిన విధంగానే జగన్ సైతం చేస్తాడని ఊహించారు. కానీ అప్పుడప్పుడే కొత్త రాష్ట్రంగా విడిపోయిన ఏపీకి కొత్త ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి. ఒక యువకుడిగా తాను చేయాల్సింది చేస్తూ పోతున్నాడు. కానీ జగన్ వైఎస్ లాగానే సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశాడు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లో భావన నిర్మాణ కార్మికులు ఇసుక లేమి వలన చాలా ఇబ్బందులు పడ్డారు.
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన రోజులవి అని చెప్పవచ్చు. కానీ మళ్ళీ ఇసుక సమస్యను మెల్ల మెల్లగా పరిష్కరించి ప్రజల మన్ననలు పొందగలిగాడు. అయితే చాలా మంది ఇప్పటికీ జగన్ ను తన నాన్న వైఎస్ తో పోల్చి చూస్తున్నారు. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎంపీగా ఉన్నారు. అయితే వైఎస్ లాగా పాలనా కొనసాగించడంలో విఫలమయ్యారనే అపవాదు ప్రజల్లో ఇంకా ఉంది. ముఖ్యంగా వైఎస్ లాగా సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడుతున్నాడు. ప్రజల్లో ఇప్పటికీ అంత పేరుందంటే దానికి కారణం ప్రజలకు మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలు తీసుకోవడమే. నిన్న వైఎస్ వర్ధంతి కారణంగా ప్రజలు ఒకసారి వైఎస్ తో జగన్ ను పోల్చి చేశుకునట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటికీ జగన్ వైఎస్ లా కాలేడని ప్రజలు అనుకుంటున్నారు. మరి భవిష్యతులో అయినా వైఎస్ మాదిరి పాలన సాగించగలడా అన్నది చూడాలి.