తాలిబన్ల వల్లే పెట్రోల్ ధర పెరిగిందట.. ఇదెక్కడి విడ్డూరం?
అయితే పెట్రోల్ ధరలు భారీగా పెరిగి పోవడానికి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులే కారణం అనే విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఏకంగా ఒక బీజేపీ ఎమ్మెల్యే పెట్రోల్ ధరల పెరుగుదల పై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. భారత్లో ఇంధన ధరలు వంటగ్యాస్ ధరలు పెరగడానికి ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లే కారణం అంటూ కామెంట్స్ చేశాడు. కర్ణాటకలోని హుబ్లీ ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల మీడియా సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి తాలిబన్లు కారణం అంటూ వ్యాఖ్యానించాడు. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల సంక్షోభం ముదురుతుంది. అందువల్ల ముడి చమురు సరఫరాలో తగ్గుదల ఏర్పడుతుంది అని చెప్పుకొచ్చారు. ఫలితంగా ఎల్పిజి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. ఓటర్లకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునే అంత జ్ఞానం లేదు ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అరవింద్. అరవింద వ్యాఖ్యలపై అటు జనాలు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల సంక్షోభం మొదలై కేవలం నెల రోజులు కూడా కావడం లేదు. కాని దేశంలో ఎన్నో రోజుల నుంచి ఇంధన ధరలు పెరుగుతున్నాయి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.