జగనన్న ఆర్థికం : అధికార దాహం అంత ప్రమాదకరమా?

RATNA KISHORE
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ తో సహా కొన్నింటిని కేంద్రం అమ్ముతోంది. కొన్నింటిని రాష్ట్రం అమ్మేందుకు యోచన చేస్తోంది. ఆ కోవలోనే భూ ముల అమ్మకం కూడా త్వరలో జరిగిపోవచ్చు. ప్రభుత్వ ఆస్తులు అలా కరిగిపోయినా ఎవ్వరూ అడగకండి. అధికార దాహంలో భా గంగా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుకు వైసీపీ చేస్తున్న సన్నాహాలు ఏ మేరకు ఫలిస్తాయి అన్నది ముఖ్యాంశం.




ప్రభుత్వానికి అంటూ ఆస్తులుండవు
భవిష్యత్ ఇదే! అన్నీ ప్రయివేటు పరం
అయిపోతాయి.. పాలకులకు సాయం
చేసే క్రమాన కార్పొరేట్ శక్తులు చేసే పని ఇదే!



ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయం ఎన్నడూ నడుస్తూనే ఉంటుంది. గెలిచే వాళ్లు గెలుస్తారు. గెలవలేని వాళ్లు గెలుపు కోసం దారు లు వెతుకుతారు. ఇవన్నీ ఎలా ఉన్నా రాజకీయం మాత్రం డబ్బులు చుట్టూనే తిరుగుతుంటుంది. డబ్బులున్నోళ్లకే ఈ రంగం క లిసి వస్తుందన్న నమ్మకం కూడా రోజురోజుకీ స్థిరపడిపోతోంది. కార్పొరేట్ పాలిటిక్స్ అన్నవి హల్ చల్ చేయడం మొదలుపెట్టాక డ బ్బుల విలువ అమాంతం పెరిగిపోయిందన్నది వాస్తవం. దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేసే శక్తి దక్కడం కూడా కొన్ని పార్టీలకు అనుకూలించే విషయం. దీంతో ప్రభుత్వ ఆస్తుల వేలం, తాకట్టు తదితర ప్రక్రియలన్నీ సు లువుగా సాగిపోతున్నాయి. ఎటువంటి ఆటంకం లేకుండానే పాలక వర్గాల నుంచి డబ్బులు చేతులు మారి పెద్ద పెద్ద కంపెనీలకు రుణాల రూపంలో అందుతున్నాయి.


 

ఇవన్నీ  ఓ వైపు ఉంటే  వైసీపీ ప్రభుత్వంకు కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీలు వెనుక ఉన్నాయి. అవి మాత్రమే రాజకీయం నడు పుతున్నాయి అని విమర్శ కూడా ఉంది. ఇప్పటికే పోర్టుల విషయమై పీపీపీ (పబ్లిక్ అండ్ ప్రయివేట్ పా ర్టిసిపేషన్) విధానం అ మలవుతోంది. గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలు కూడా కార్పొరేట్లు నడిపితే పోర్టులేంటి ఇంకా ఇంకొ న్ని ప్రభుత్వ ఆస్తు లు కంపెనీల పరమైపోతాయి. అధికార దాహం ఏ పార్టీకి ఉండదు అని ప్రశ్నించకండి. అన్ని పార్టీలూ అదే కోవ. కాకపోతే కొన్ని మరిం త ఎక్కువ శ్రద్ధతో ఉంటాయి. రాజకీయం నడుపుతూ తమ పార్టీల మనుగడ ఏంటన్నది ఆలోచిస్తాయి. ఆ కోవలో వైసీపీ ఉందా లేదా అన్నది ఎవరికి వారు తేల్చుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: