కరోనా కొత్త వేరియంట్ తో కలవరం..!

NAGARJUNA NAKKA
ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తుండగా.. ఇందులో నుంచి పుట్టుకొచ్చిన AY.12 సబ్ వేరియంట్ ప్రస్తుతం కలవర పెడుతోంది. మరింత వేగంగా విస్తరించే ఈ వేరియంట్ తొలుత ఆగస్ట్ 30న ఉత్తరాఖండ్ లో వెలుగు చూసింది. వారంలోపే తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు ఏపీలో 18, తెలంగాణలో 18చొప్పున నమోదయ్యాయి.

ఇక కేరళలో కరోనా వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో 29వేల 682మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కాటుకు 142మంది బలయ్యారు. ప్రస్తుతం 2.5లక్షల యాక్టివ్ కేసులున్నాయి. సగటున వంద మందికి టెస్టులు చేస్తే 18మందికి పాజిటివ్ వస్తోంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఆదివారం లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది.

కేరళలో కరోనాతో పాటు నిఫా వైరస్ మళ్లీ వెలుగు చూసింది. కొజికోడ్ లో 12ఏళ్ల బాలుడు నిఫా వైరస్ తో మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆందోళ చెందాల్సిన పనిలేదనీ.. బాలుడి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ వ్యాపించలేదని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

మరోవైపు దేసంలో కరోనా కేసుల సంఖ్య 40వేలకు తగ్గడం లేదు. గత 24గంటల్లో 42వేల 766 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 308మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4లక్షల 40వేల 533కి చేరింది. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4లక్షల 10వేల 48ఉన్నాయి. తాజాగా 38వేల 91మంది కరోనాను జయించారు. మరోవైపు నిన్న 71లక్షల 61వేల 760మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 68,46,69,521మది టీకా తీసుకున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఉంది. కరోనా నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: