తాలిబన్లకు ఊహించని షాక్.. 600 మంది హతం.. ఏం జరిగిందంటే?
కాగా ఇప్పటి వరకు తాలిబన్లు పలుమార్లు పంజ్ షేర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడి చేశారు. కానీ అక్కడి తిరుగుబాటుదారుల దెబ్బకు ఇక తాలిబన్లు తోకముడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇటీవలే మరో సారి అల్‌ఖైదా తీవ్రవాదుల తో చేతులు కలిపి తాలిబన్లు పంజ్ షేర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పంజ్ షేర్ తిరుగుబాటుదారులు తాలిబన్ల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇకపోతే ఇటీవలే తాము పంజ్ షేర్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించాము అంటూ కాబూల్‌లో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. కానీ తాము ఇంకా యుద్ధం కొనసాగిస్తున్నామని తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తి లేదు అంటూ అటు వెంటనే తిరుగుబాటుదారుల స్టేట్మెంట్లు ఇచ్చారు.
ఇకపోతే ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లోని పంజ్ షేర్ ఆక్రమించుకోవడానికి వెళ్లిన తాలిబన్లకు భారీ ఎదురు దెబ్బ తగిలినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇటీవల శనివారం రోజున పంజ్ షేర్ లోని వివిధ జిల్లాలో ఏకంగా ఆరు వందల మంది తాలిబన్లను అక్కడి తిరుగుబాటుదారులు హతమార్చినట్లు తెలుస్తోంది ఇక మరో వెయ్యిమందికి పైగా తాలిబన్లను బందీలుగా మార్చుకున్నారట తిరుగుబాటుదారులు. ఇక ఈ విషయాన్ని స్పుత్నిక్ మీడియా వెల్లడించింది. ఇక ఇదే విషయాన్ని పంజ్ షేర్ తిరుగుబాటుదారుల ప్రతినిధి ఫహీమ్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం తాలిబన్లు పంజ్ షేర్ తిరుగుబాటుదారుల మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది.