కరీంనగర్
జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్ లో ట్రస్మా నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రులు తన్నీరు హరీష్ రావు గంగుల
కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.... ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న, ఎంతటి స్థాయి కి ఎదిగిన గురువు గుర్తుకు వస్తారని... ఉపాధ్యాయ ఎం ఎల్ సి అని గురువులు చట్టసభల్లో ఉండాలని పెట్టుకున్నామని స్పష్టం చేశారు. విద్య ఉద్యోగం కోసం కాదు, ఉన్నతమైన గౌరవం కోసమని... కంటికి కనబడని సూక్ష్మ జీవి ప్రపంచాన్ని గడగడలాడించిందని
మంత్రి హరీష్ రావు.
కరోనా వ్యాధి అన్ని రంగాలను దెబ్బ తీసిందని... రెక్కాడితే డొక్కాడని వారు ప్రయివేట్ ఉపాధ్యాయులు అని ఆయన వివరించారు. జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నవో ఆ జిల్లాల వారికే ఉద్యోగాలు కల్పించాలని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని స్పష్టం చేశారు
మంత్రి హరీష్ రావు. జోనల్ విధానంలో మార్పులు చేర్పులు జరుగుతున్నవి , ఉద్యోగాల భర్తీలో ఆలస్యం అవుతుందని...
విద్య , వైద్య వ్యవస్థను పటిష్టం చేద్దామన్నారు హరీష్ రావు.
ఒక్కో జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు దిశగా ప్రభుత్వ ప్రవేశపెడుతుందని... ఏ ఏ రంగాల విద్యకు ఆయా రంగాల నుండి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తమది ఆయన వెల్ల డించారు. విద్యకు ఖర్చు పెట్టట్లేదు అనుకోవద్దని.... ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా పెరు పేరున శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. ఇక
తెలంగాణ రాష్ట్రంలోని ప్రయివేట్ ఉపాధ్యాయులకు డబుల్ బెడ్రూం లు కల్పిస్తామని స్పష్టం చేశారు
మంత్రి హరీష్ రావు. గ్యాస్ సిలిండర్, డిజిల్, పెట్రో ల్ ధర పెంచింది
బీజేపీ పార్టీ అని మండి పడ్డారు. కేంద్రం లో ఉన్న
బీజేపీ పార్టీ కారణంగా ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు.