పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు. ఖమ్మం జిల్లా లోని నేలకొండ పల్లి మండల చెన్నారం గ్రామం లో విలేకరుల సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ... తాను టిఆర్ఎస్ పార్టీ లో చేరేటప్పుడే చెప్పానని.....తెలంగాణ రాష్ట్రం లో ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ కొనసాగిస్తున్నప్పుడు.. ఇంకో పార్టీ కి అవకాశం ఉండదని తెలియ జేశారు.
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ కు తనకు సుదీర్ఘ కాలం పాటు రాజకీయ నేపథ్యం ఉందని.....తమ ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీ లో చేరానని స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వర రావు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో సాధ్యం కాని భారీ ప్రాజెక్టులు కోసం.. జిల్లా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసానని స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వర రావు. దేశ రాజధాని ఢిల్లీ లో ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కి.. కార్యాలయం లేదు కానీ తెలంగాణ రాష్ట్రం లో అధికారం చేలాయిస్తున్న టిఆర్ఎస్ పార్టీ కి ఆ గౌరవం దక్కిందని స్పష్టం చేశారు తుమ్మల.
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం కు దేశ రాజధాని అయినటు వంటి ఢిల్లీ లో గౌరవం దక్కిందని స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వర రావు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తో ప్రాజెక్టులు, హైవే రోడ్లు, అంతర్గత రోడ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కొన్ని పనులు పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు తుమ్మల నాగేశ్వర రావు... ఒక్క టర్మ్ లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తో. 44 వేల కోట్ల రూపాయల ఖమ్మం జిల్లా కు తీసుకురావడం జరిగిందన్నారు తుమ్మల. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను నమ్మి మన జిల్లా అభివృద్ధి కోసం ఇవన్నీ చేశారు.. కాబట్టి ధర్మం కోసం, ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ తోనే ఉంటానని స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వర రావు. వాట్సప్ గ్రూపు ల్లో తాను పార్టీ మారుతున్నారనే విష ప్రచారమని ఆయన నిప్పులు చెరిగారు. తాను ఎప్పటికీ టీఆర్ ఎస్ పార్టీ లోనే ఉంటానన్నారు.