మాట తప్పనంటున్న గడ్కరీ.. కేసీఆర్ కు హామీ..!

NAGARJUNA NAKKA
ఢిల్లీ పర్యటలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. గడ్కరీకి 5లేఖలు ఇచ్చిన కేసీఆర్.. విజయవాడ-హైదరాబాద్ హైవేను ఆరు లైన్లుగా.. కల్వకుర్తి-హైదరాబాద్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం రహదారిని విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందన్న కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా 1138కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలనీ.. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.  

తెలంగాణలోని పలు రహదారులకు నిధులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. పలు రోడ్లను భారత్ మాల జాబితాలోకి చేర్చడంపై భరోసా ఇచ్చిన ఆయన.. కరీంనగర్-వేములవాడ-సిరిసిల్ల-పిట్లం రోడ్ ను త్వరలో జాతీయ రహదారిగా ప్రకటించి, నిధులు ఇస్తామన్నారు. అలాగే కరీంనగర్--చల్లూర్-టేకుమట్ల -భూపాలపల్లి రోడ్డుకు హైవే హోదాకు అంగీకరించిన గడ్కరీ.. త్వరలో పూర్తిస్థాయి హైవేగా గుర్తిస్తామని చెప్పారు.

మరోవైపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడో టీఎంసీ పనులుకు అనుమతులు.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం, కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన నీటి కేటాయింపులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేంద్ర గెజిట్ పై అభ్యంతరాలను కేసీఆర్ కేంద్రమంత్రికి వివరించారు.

ఇక కేంద్ర జలశక్తి శాఖ కన్సల్టెన్సీ సంస్థ వ్యాప్కోస్ త్వరలో ఐపీఓకి రానుంది. 2022 మార్చిలోగా వ్యాప్కోస్ ఐపీఓకు రానున్నట్టు సమాచారం. ఐపీఓ ద్వారా వ్యాప్కోలో 25శాతం వాటాలను  ఉపసంహరించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం ప్రక్రియ ప్రారంభించినట్టు సమాచారం. నీరు, విద్యుత్ రంగాల్లో మౌలిక వసతులపై కన్సలెన్సీ, ఇంజినీరింగ్, నిర్మాణ సేవలను వ్యాప్కోస్ నిర్వహిస్తుంటుంది. మొత్తానికి సీఎం కేసీఆర్ పర్యటన ఢిల్లీలో బిజీబిజీగా సాగుతోంది. పలు సమస్యలకు పరిష్కారం కూడా దొరికినట్టు తెలుస్తోంది. చూద్దాం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తుందో.







 






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: