అందరి బాధ్యతను గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి !
దేశంలో గత 24గంటల్లో 17లక్షల 53వేల 745కరోనా టెస్టులు చేస్తే 37వేల 875మందికి పాజిటివ్ వచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో 369మంది చనిపోయారు. మొత్తం కేసులు 3కోట్ల 30లక్షల 96వేల 718కు చేరగా.. 4లక్షల 41వేల 411మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 39వేల 114మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3లక్షల 91వేల 256 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 70.75కోట్ల టీకా డోసులు ఇచ్చారు.
కేరళలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. ప్రతీ రోజు 25వేలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. తాజాగా 25వేల 772కరోనా కేసులు రాగా.. 189మంది చనిపోయారు. అలాగే 27వేల 320మందికి కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2లక్షల 37వేల 45యాక్టివ్ కేసులున్నాయి. అటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న నైట్ కర్ఫ్యూ, ఆదివారం లాక్ డౌన్ ను తొలిగిస్తూ సీఎం విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైన కారణంగా తెలంగాణ విద్యాశాఖ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు కరోనా నిర్థారణ అయితే కాంటాక్ట్ ఉన్న అందరికీ వెంటనే టెస్టులు చేయాలని.. కరోనాతో మరణించిన వారి పిల్లలను ఏ కారణంతోనూ ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసివేయకూడదని పేర్కొంది. విద్యార్థులు ఇంటి నుంచి చదువుకుంటామంటే అనుమతి ఇవ్వాలంది.
ఇక తెలంగాణలో నిన్న 298కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. 25మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 5వేల 476యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది.