జర్నలిస్టులపై తాలిబన్లు దారుణం..వీపులపై వాతలు పెట్టి మరీ !

Veldandi Saikiran
అఫ్ఘనిస్థాన్‌ దేశంలో తాలిబన్ల దారుణ మైన పాలన రోజు రోజు కు రెట్టింపు అవుతోంది.  ఇక ఇది వరకే ఫ్రీడం కోసం పోరాట చేస్తున్నటు వంటి ఆ దేశ మహిళలను ఎక్కడిక్కడే అణిచి వేతకు గురి చేస్తున్న ఈ రాక్షస తాలిబన్లు... ఇప్పుడు జర్నలిస్టుల పై పడ్డారు.  అఫ్ఘనిస్థాన్‌ దేశం లో తాలిబన్ల అరాచకాలను కవర్‌ చేస్తున్న విలేకర్ల పై కూడా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఆ రాక్షసులు.  జర్నలిస్టులు ఎక్కడ కనబడి తే.. అక్కడే అంత్యంత దారుణంగా హింసకు గురి చేస్తున్నారు.  


ఇక తాలిబన్ల చేతిలో దారుణంగా గాయ పడ్డ కొందరు జర్నలిస్టు ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియా లో తెగ వైరల్‌ అవుతున్నాయి.  పశ్చిమ కాబూల్‌ లోని కర్తే ఛార్‌ అనే ప్రాంతంలో అఫ్ఘనిస్తాన్‌ లోని తాలిబన్ల సర్కార్‌ కు విరుద్ధంగా నిరసన కార్యక్రమాన్ని బుధ వారం రోజున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కొందరు మహిళలు. అయితే.. ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు తాలిబన్ రాక్షసులు. అయితే... ఈ దౌర్జన్యాన్ని ఎవరికీ తెలియకుండా మీడియా కు చెందిన కొందరు జర్నలిస్టు లు కవర్‌ చేశారు. దీంతో ఆగ్రహానికి గురి అయిన తాలిబన్లు...  ఆ జర్నలిస్టు లపై దాడికి దిగారు.  


అఫ్ఘానిస్థాన్‌ దేశం^లోని ప్రముఖ మీడియా సంస్థ అయిన ఎట్లియాట్రోజ్‌ కు సంబంధించిన వీడియో ఎడిటర్‌ థాఖీ దర్యాబీ మరియు రిపోర్టర్‌ నెమతుల్లా నక్దీలను తాలిబన్లు చిత్ర హింసలకు గురి చేశారు. చాలా దారుణంగా హింసించారు. అయితే.. ఈ విషయాన్ని బట్ట బయలు చేసింది ఆ దేశానికి^సంబంధించినటు వంటి ఓ మీడియా సంస్థ.  దారుణంగా ఆ జర్నలిస్టు లను కొట్టారని... వీపు లపై వాతలు పెడుతూ.. దౌర్జన్యంగా వ్యవహరించారని తెలిపింది.  అంతేకాదు.. నరకయాతన అనుభవించిన జర్నలిస్టులు ఫోటోలను కూడా షేర్‌ చేసింది ఆ మీడియా సంస్థ. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియా లో వైరల్‌ గా మారాయి.  ఈ పోటోలు చేసిన.. నెటిజన్లు తాలిబన్ల చర్యలపై మండిపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: