మా ఉద్దెర బేరాలు లేవమ్మా ?

Veldandi Saikiran
భారతీయ జనతా పార్టీ పై మరోసారి  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు షాకింగ్  కామెంట్స్ చేశారు.  సీఎం కెసిఆర్ పాలన లో సంక్షేమ యుగం నడుస్తోందన్నారు.  చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం తమకు తెల్వదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు.   రేపురా.. మాపురా అనే ఉద్దెర బేరాలు తమ  దగ్గర ఉండవని పేర్కొన్నారు హరీశ్ రావు.  


భారతీయ జనతా పార్టీ  పాలన లో పెట్రోలు, డిజీల్, గ్యాస్ ధరలు పెరిగాయని... గ్యాస్ సబ్సిడీ తగ్గించా రని పేర్కొన్నారు హరీశ్ రావు.  అయినప్పటికీ పువ్వు గుర్తుకే ఓటు వేస్తే.. సిలిండర్ ధర 1500 అవుతుందని చురకలు అంటించారు.  బొట్టు బిల్లలు, గోడ గడియారాలు ఇస్తామన్న మాటలు ఆపేసి.. సిలిండర్ ధర, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని, సబ్సిడీ ఎప్పటి లాగే ఇస్తామని చెప్పాలని మండి పడ్డారు హరీశ్ రావు. బీజేపీ ప్రభుత్వం రైల్వేలు, ఎల్ఐసీ, విమానశ్రాయాలు, నౌకాశ్రయాలు అమ్మి, కుదవపెట్టి.. ఉద్యోగాలన్నీ ఊడగొడతారట అంటూ ఎద్దేవా చేశారు హరీశ్ రావు.  


ప్రభుత్వ రంగ సంస్థలు కార్పోరేట్ సంస్థల చేతిలోకి పోతే రిజర్వేషన్లు పోయి.. పిల్లలకు ఉద్యోగాలు ఊడుతాయని నిప్పులు చెరిగారు.   బీజేపీ అనుబంధ కార్మిక సంఘమైన బీఎంఎస్ కూడా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.  బీజేపీ కిసాన్ మోర్చా కూడా.. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తోందని తెలిపారు హరీశ్ రావు.   ఆ పార్టీని సొంత మనుషులే తప్పు పడుతుంటే.. మనం ఎందుకు ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు హరీశ్ రావు.  తెలంగాణ రాష్ట్ర అభివృద్ది అధికార టిఆర్ఎస్ పార్టీ తో నే సాధ్య మన్నారు హరీశ్ రావు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం లో అధికారం లోకి  వచ్చేది టిఆర్ఎస్ పార్టీ అని చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: