రేవంత్ ముహూర్తం పెట్టుకున్నారా...?

Gullapally Rajesh
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేసినా సరే పార్టీ విషయంలో కొంతమంది సీనియర్ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ లో చాలా వరకు కూడా కీలక నాయకులు అందరూ  రేవంత్ రెడ్డి  కు దూరంగా ఉన్నారని పదవులు ఆశించిన వారిని రేవంత్ రెడ్డి ఇప్పుడు పక్కన పెడుతున్నారని అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్దగా సహకరించడం లేదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి మల్లారెడ్డి విషయంలో అలాగే కొంతమంది విషయంలో రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల నుంచి ఆయనకు సహకారం అందడం లేదు అనే మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులు పదవులు అనుభవించిన తర్వాత పార్టీని పక్కన పెట్టడమే కాకుండా ఇప్పుడు పార్టీ ముందుకు వెళ్లే సమయంలో రేవంత్ రెడ్డికి సహకారం అందించడంతో ఇప్పుడు ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు అని త్వరలోనే ఆయన పార్టీ అధిష్టానానికి కొంతమంది విషయంలో నివేదికలు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రేవంత్ రెడ్డి వచ్చే ఏడాది పాదయాత్రను మొదలుపెడితే అవకాశం ఉందనే ప్రచారం కాస్త మీడియా వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచన మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రేవంత్ రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్రను నవంబర్ రెండో వారం నుంచి మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని దీనికి సంబంధించి రాహుల్ గాంధీ వద్ద కూడా ఆయన అంగీకారం తీసుకున్నారని ఆ సమయంలోనే నియోజకవర్గాల ఇన్చార్జిలు ఆయన ప్రకటించే అవకాశం ఉందని అలాగే వాళ్లకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధమవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: