ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయిగా పుట్టడమే నేరమా అక్కడ అమ్మాయిగా పుడితే వివస్త్రగా మారాల్సిందేనా, అసలు అమ్మాయిలంటే లెక్కే లేదా, కనీసం మనుషుల కింద కూడా లెక్క చేయరా అంటూ ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న సమయంలో అక్కడి ధీరవనిత తనలోని మరో కోణాన్ని కూడా దాగి ఉందని చూపించింది. అంతర్జాతీయ సమాజం మద్దతు లేకపోయినా, ఎవరో వచ్చి తమ అవమాన భారాన్ని ఆపేస్తారని అనుకోవడం లేదు అక్కడి మహిళలు, వారి అపర కాళికలా మారి తాలిబన్లపై తెగబడుతున్నారు. బుల్లెట్ల వర్షం కురుస్తున్న భయమన్నది లేకుండా కాల్చు అంటూ స్వాతంత్రోద్యమంలో టంగుటూరి ప్రకాశం పంతులు తుపాకి గుళ్ళకు ఏవిధంగా గుండెలు అడ్డు పెట్టడని మనం పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మహిళలు అలాంటి తెగువే కనబరుస్తూన్నార్ మహిళలను మనం ప్రత్యక్షంగానే చూస్తున్నాం.
సాధారణంగా ఏ దేశంలో నైనా ఆందోళనలు పోరాటాలు నిరసనలు చేయడంలో పురుషులే ముందుంటారు. కానీ ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి దీనికి భిన్నంగా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో పురుషులు ఇళ్లకే పరిమితం అయితే, అక్కడి మహిళలు పోరుబాట పట్టారు. శ్వాస తీసుకోవాలి అన్న తాలిబన్ల అనుమతి తీసుకోవాలనే నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నారు.
ఆగస్టు 15న తాలిబన్లు కబుల్ ను ఆక్రమించారు. అంతకు కొద్ది గంటల ముందు అధ్యక్షుడు ఆఫ్ఘనిస్తాన్ వదిలి పారిపోయాడు. మంత్రులు మూటాముల్లె సర్దుకున్నారు. కొందరు దేశం వదిలి పారిపోయారు.
కానీ కొంతమంది మహిళలు మాత్రం ప్రాణాలకు ఎదురొడ్డి తాలిబన్ల పై తిరుగుబాటు మొదలుపెట్టారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ తమ హక్కుల కోసం గొంతేత్తు తున్నారు. ఈ పోరాటం ప్రపంచం దృష్టికి ఆక్రమించి నప్పటికీ రానున్న రోజుల్లో ఇది కొనసాగుతుందని ఎవరు నమ్మలేరు. ఇక మహిళలను వీధుల్లో చూస్తామని ఎవరూ ఊహించలేదు. అలాంటి పరిస్థితి నుంచి తాలిబన్లకు ఎదురుగా నిలిచి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆఫ్ఘనిస్తాన్ మహిళలు తమ పోరాటాలను ముమ్మరం చేస్తున్నారు.