ఓవర్ టు సీఎంఓ : ముఖ్యమయిన వ్యక్తితో ముఖ్యమంత్రి ?
అన్నింటికీ ఆంక్షల మార్గం ఒకటి స్పష్టం అయిపోయింది. పారదర్శకతతో పాలించాల్సిన సర్కారు రహస్య మార్గాలను అన్వేషిస్తోంది అన్నది విపక్షాలు విమర్శ.
ఏం జరిగినా బయటకు రానివ్వకు..ఏం చెప్పినా అది ఆచరణ మాత్రం చేయాల్సింది వెనక్కు తగ్గకు. ఇదీ ఆంధ్రాలో ప్రస్తుతం నెల కొంటున్న పరిణామాలకు ఉదాహరణ. ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పినా అది విని ఆచరించాలి తప్ప ఎదురు చెప్పకూడదు. ఆ నిర్ణ యాల్లో మతలబు ఉన్నా వాటి గురించి రాయకూడదు. కలెక్టర్ మొదలుకుని సీఎస్ వరకూ విధానపర నిర్ణయాల్లో తప్పులు చేస్తే ప్రశ్నించకూడదు. అదేవిధంగా జీఓల పై కూడా ఓ విధంగా ఆంక్షలే నడుస్తున్నాయి. జీఓల గురించి బయట ప్రపంచానికి ఎందు కు? అన్న ప్రశ్న ఒకటి ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వేసింది. ప్రభుత్వ నిబంధనలు, నియమావళి వీటిపై ఎవ్వరూ ఎక్కడా రాయకూ డదు అని కూడా ఆంక్ష ఉంది.
ఉల్లంఘనపై పెద్దగా పెదవి విప్పకూడదు అన్నది సీఎం తీసుకున్న అంతర్గత నిర్ణయం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల వ్యవ హారం, పోర్టుల వ్యవహారం అన్నవి అత్యంత తేలికగా చేతులు మారినా మీరు రాయకండి అనే చెబుతోంది సర్కారు. కీలక వ్యక్తులం తా సీఎంను కలిసి, మీడియా కంటికి చిక్కకుండా వెళ్లిపోవడం మినహా వాళ్లను మనం ప్రశ్నించేదేమీ ఉండదు? ఉండకూడదు?
జీఓలు మొదలుకుని, కీలక వ్యక్తులతో భేటీ వరకూ రాష్ట్ర ప్రభుత్వం అంతా రహస్యంగానే ఉంచుతోంది. నిన్న మధ్యాహ్నం అదానీ గ్రూపునకు చెందిన అధినేతలతో సీఎం భేటీ అయిన విషయం ఎక్కడా బయటకు వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతోంది. రాష్ట్ర ప్రభు త్వం తరుచూ వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుండడంతో నిన్నటి భేటీ కూడా ఆ విధంగా కాకుండా ఉండేందుకు జాగ్రత్త పడిం ది. అయితే ఎట్టకేలకు ఇందుకు సంబంధించిన వివరం వెలుగుచూసింది. కొన్ని మీడియా సంస్థలు ఈ వివరం లీక్ చేశాయి. దీంతో సీఎంఓ ఖంగు తిన్నట్లైంది. ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న గంగవరం పోర్టుకు సంబంధించి మళ్లీ మరోమారు చర్చలు సాగాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను అదానీలకు చౌక ధరకే అమ్మేసింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ వెలుగు చూసింది.